కుట్టి పద్మిని.సౌత్ ఇండియన్ పాపులర్ నటి.ఎక్కువ గా తమిళ సినిమాల్లో నటించింది.తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు కూడా చేసింది.
బాల నటిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన ఈమె తమిళంలోని స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది.తన తల్లి మూలంగానే సినిమాల్లోకి అడుగు పెట్టినా తన తల్లికి తనపై ఎంతో కోపం కలిగేలా చేసినట్లు వెల్లడించింది ఈ నటీమణి.
ఇంతకీ తన తల్లికి తనపై ఎందుకు కోపం పెరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కుట్టి పద్మిని తల్లి రాధాబాయి కూడా మంచి నటి.
తెలుగులో పలు సినిమాలు చేసింది.దేవుళ్లు సినిమాలో బామ్మ క్యారెక్టర్ చేసింది తనే.
ఆమె తన కూతురును పెద్ద హీరోయిన్ చేయాలని కలలు కన్నది.కానీ పద్మిని ఆమె కలలను నెరవేర్చలేకపోయింది.22 ఏండ్లేకే ప్రేమ పెళ్లి చేసుకుంది.అమ్మకు ఇష్టం లేకపోయినా ఈ వివాహం చేసుకుంది.
అప్పటి నుంచే తనపై తన తల్లికి కోపం పెరిగింది.ఇంట్లో పద్మినికి సంబంధించిన అన్ని వస్తువులకు నిప్పుపెట్టి బూడిద చేసింది.
ప్రముఖులతో పద్మిని దిగిన ఫోటోలను కూడా కాల్చివేసింది.

ఆ తర్వాత చాలా కాలం తల్లికి దూరంగా ఉంది పద్మిని.హేరామ్ సినిమా సమయంలో కమల్ పద్మిని, రాధాబాయిని పిలిచి మాట్లాడారు.ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పాడు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారు.తన తల్లి చనిపోయేంత వరకు పద్మిని దగ్గరే ఉంది.
కానీ తన మీద గతంలో ఉన్నంత ప్రేమ ఉండేది కాదు.తనతో తక్కువగా మాట్లాడేది.
కానీ ఓసారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి చెప్పి బాధపడింది.

ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కమెడియన్ గౌండమణి రాధాబాయిని మోస్తాడు.ఈ సందర్భంగా పాడెను సరిగి పట్టుకోకపోవడంతో ఆమె కిందపడి తలకు పెద్ద గాయం అయ్యింది.పల్లెటూరులో షూటింగ్ కావడంతో చికిత్స చేయడంలో చాలా ఇబ్బంది అయ్యింది.దెబ్బలతోనే మద్రాసుకు వచ్చింది.అయితే గౌండమణి ఆ సమయంలో తనకు సాయం చేయలేదని తన కూతురుతో చెప్పుకుని బాధపడింది.అప్పటి నుంచి ఆ కమెడియన్ పై తనకు కోపం కలిగిందని చెప్పింది.