భారతదేశంలో ఎక్కువమంది ఆరాధించే అభిమానులు ఉండేది మొదట సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న హీరోలకు హీరోయిన్లనే. రెండోది క్రికెట్ ఆడే క్రికెటర్లకి కూడా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఎందుకంటే ఇండియాలో క్రికెట్ సినిమా అనేవి రెండూ చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి.అందులో భాగంగానే చాలా మంది హీరోలు క్రికెటర్లు సపరేట్ ఫ్యాన్స్ ని కలిగి ఉన్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చాలామంది క్రికెటర్లు ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారందరితో కలిసి తిరగడం ప్రేమించుకోవడం కొందరైతే పెళ్లి కూడా చేసుకున్న వారు ఉన్నారు అలా చాలా మంది క్రికెటర్లు హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తూ ఉన్నారు.
అందరిలోకెల్లా అప్పట్లో క్రికెటర్ సౌరవ్ గంగూలీ హీరోయిన్ నగ్మా వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
ఇండియన్ టీం కెప్టెన్ గా సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఇండియన్ టీం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాడు.అలా తన కెప్టెన్సీలో చాలా కప్పులను ఇండియన్ టీంకి అందిస్తూ తన వంతు కృషి చేస్తూ అప్పట్లో ప్రపంచంలోని కెప్టెన్లలో అగ్రస్థానంలో నిలిచాడు.
గంగూలీ సారధ్యంలోనే సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడేవారు.ముఖ్యంగా ఎంఎస్ ధోని లాంటి క్రికెటర్ ని కూడా సౌరవ్ గంగూలీనే ఇండియన్ టీం కి తీసుకొచ్చాడు అంటే నిజంగా ఒక రకంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక గంగూలీ పర్సనల్ లైఫ్ లో చాలా వివాదాలను ఎదుర్కొంటూ వచ్చాడు.దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సాధించి, అలాగే బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో అగ్ర హీరోల పక్కన నటించి నటనలో తనదైన ముద్రను వేసుకుంది నగ్మా. అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.ఇండియన్ టీం కెప్టెన్ గా గంగూలి అగ్ర స్థానంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అనే రూమర్లు అప్పట్లో చాలా బాగా వచ్చాయి.

అయితే అప్పటికే 1997లో గంగూలీ డోనా అనే ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ తర్వాత నగ్మా గంగూలి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని మీడియాలో కూడా కథనాలు రాశారు దానికి తగ్గట్టే వాళ్లు తిరిగిన ఫోటోలు కూడా మీడియాలో వచ్చాయని చెప్పాలి చాలా కాలం పాటు ఇద్దరూ పర్సనల్ గా డేటింగ్ కూడా చేసినట్లు తెలుస్తుంది అయితే ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు అని చాలా మంది చెబుతుంటారు.

అయితే ప్రస్తుతం గంగూలి తన ఫ్యామిలీతో ఉంటూ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు నగ్మా మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అలానే ఉండిపోయింది.ప్రస్తుతం గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతూ అద్భుతంగా తన నిర్ణయాలు తీసుకుంటూ ఇండియన్ టీమ్ని బలోపేతం చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో తనదైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.గంగూలీ లాంటి క్రికెటర్ ప్రస్తుతం ఇండియన్ టీం కి అవసరం ఉందని చాలామంది దిగ్గజ ఆటగాళ్లు సైతం కొనియాడారు అంటే గంగూలి అప్పట్లో ఎంత మంచి ప్లేయరో మనం అర్థం చేసుకోవచ్చు…
.