థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో హిట్.. గేమ్ ఛేంజర్ మూవీ సాధించిన రికార్డ్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.రామ్ చరణ్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.

 Game Changer Movie Sensational Record Details, Ram Charan, Game Changer Movie,-TeluguStop.com

గేమ్ చేంజర్( Game Changer ) సినిమాకు రిలీజ్ రోజున నెగెటివ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా నిరాశపరిచింది.సినిమా విడుదలైన రోజున గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ కూడా లీక్ కావడం ఈ సినిమా కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా గేమ్ చేంజర్ నిలిచింది.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది( Peddi ) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.2026 సంవత్సరం మార్చి నెల చివరి వారంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈనెల 27 వ తేదీన ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అయితే థియేటర్లలో ప్లాప్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఓటీటీలో ( OTT ) మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Telugu Amazon Prime, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Ramcharan,

గేమ్ చేంజర్ సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా గేమ్ చేంజర్ హిందీ వర్షన్ మాత్రం జీ5 ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది.ఈనెల 7 వ తేదీ నుంచి గేమ్ చేంజర్ హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.జీ5 ఓటిటీలో ఈ సినిమాకు ఏకంగా 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చినట్టు జీ5 సంస్థ ప్రకటించింది.

Telugu Amazon Prime, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Ramcharan,

గేమ్ చేంజర్ ఓటీటీలో క్రియేట్ చేసిన రికార్డు విషయంలో మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.రామ్ చరణ్ 17 వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనుండగా ఈ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube