1.ఏపీలో అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు అయింది.ఈనెల 8 న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అమిత్ షా పర్యటించనున్నారు.
2.జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లా టిడిపి కీలక నేత, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.శాంతిభద్రతాల దృష్ట్యా పెన్షన్ , పంపిణీకి రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.
3.శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కించారు 7.68 కోట్లు హుండీ ద్వారా వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
4.కే ఏ పాల్ కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబుతో జత కడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు.
5.కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకలు పంపిణీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది.
6.కెసిఆర్ పై జీవీఎల్ కామెంట్స్
టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జేబీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు .ఏపీ ప్రజలను మోసం చేయడానికి తెలంగాణకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ వస్తోందని, గతంలో ఆంధ్రావాళ్లను కేసీఆర్ కుక్కలు అన్నారా లేదా అని జీవీఎల్ ప్రశ్నించారు.
7.ప్రభుత్వ జీవో పై కోర్టుకు వెళ్తాం : సిపిఐ
ర్యాలీ సభలు సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.ఇది నిబంధనలపై తాము కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు.
8.జేఎన్టీయూహెచ్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్లు
జై ఎన్ టి యు హెచ్ కు 2021 22 గ్రీన్ ఎన్విరాన్మెంట్ అవార్డుతో పాటు , నాలుగు ఐఎస్ఓ సర్టిఫికెట్లు వచ్చాయి.
9.అచ్చం నాయుడు కామెంట్స్
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను అనుగుదొక్కెందుకే జీవో నెంబర్ ఒకటి అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
10.తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.సిసిఎస్ నోటీసులు పై స్టే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని సునీల్ కొనుగోలు ఆదేశించింది.
11.టిఆర్ఎస్ పై రోజా కామెంట్స్
ఏపీలో టిఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు.రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని ప్రజలు ఆదరించబోరని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
12.జీతాలు పెంచాలని మెట్రో ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు.జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు.
13.సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా
ఇంద్ర పార్కు ధర్నా చౌక్ లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నాకు దిగింది.
14.రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు
నేటి నుంచి ఆర్ జి టి పి టి సి మైదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు జరగనున్నాయి.
15. సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్
రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించడం నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు దురుద్దేశంతోనే రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
16.జ్ఞాన యోగ శ్రమ పీఠాధిపతి కన్నుమూత.ప్రధాని సంతాపం
జ్ఞాన యోగ శ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి కన్నుమూశారు.ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోది సంతాపం వ్యక్తం చేశారు.
17.ఎంపీ రఘురామ విమర్శలు
ఏపీలో రోడ్లపై సభలు ర్యాలీలు రోడ్ షో లు నిర్వహించడంపై నిషేధం చూస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.రోడ్లపై ర్యాలీలు వద్దంటారా.ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా అంటూ రఘురామ మండి పడ్డారు.
18.ఏపీలో అన్నిచోట్ల పోటీ : బీఆర్ఎస్
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
19.జగన్ కామెంట్స్
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పెన్షన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని జగన్ వ్యాఖ్యానించారు.రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,950 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,580
.