బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Former British Prime Minister Rishi Sunak)ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా క్రికెట్‌పై తన మక్కువను చాటుకున్నారు రిషి.
నగరంలోని ప్రఖ్యాత పార్సీ జింఖానా గ్రౌండ్‌లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడారు .దీనికి సంబంధించిన ఫోటోలను రిషి సునాక్ (Rishi Sunak)స్వయంగా ట్వీట్ చేశారు.అనంతరం జింఖానా వార్షికోత్సవ వేడుకల్లో సునాక్ ప్రసంగించారు.
గూగుల్ ట్రెండ్స్(Google Trends) ప్రకారం.
రిషి సునాక్ ముంబై పర్యటన తర్వాత ఆయన గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట.గుజరాత్ , ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర (Gujarat, Uttarakhand, Delhi, Haryana, Maharashtra)నుంచి ఎక్కువగా ఈ సెర్చ్ జరిగినట్లుగా గూగుల్ చెబుతోంది.
ముంబై రావడానికి ముందు.సునాక్ జైపూర్ సాహిత్య ఉత్సవానికి హాజరయ్యారు.
అక్కడ తన మామగారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో(Infosys co-founder Narayana Murthy) కలిసి సందడి చేశారు.

కాగా.గతేడాది జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.దాదాపు 14 ఏళ్లుగా అధికారం కోసం పోరాడుతున్న లేబర్ పార్టీని ఎట్టకేలకు విజయం వరించింది.
ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లో ఓటమిపై రిషి సునాక్ మాట్లాడారు.ఈ పరాజయానికి పూర్తి బాధ్యత తనేదనని ఆయన స్పష్టం చేశారు.
తనను క్షమించాలని పార్టీ మద్ధతుదారులను రిషి సునాక్ కోరారు.

14 ఏళ్ల పాలనా కాలంలో కన్జర్వేటివ్‌లు పలు దఫాలు ప్రధానులను మార్చారు.బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ వంటి నేతలపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.అలాగే ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్భణంతో పాటు వలసల నియంత్రణపై సునాక్ తీసుకున్న కఠిన చర్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
పోలింగ్‌కు ముందు నుంచే ఈసారి కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు తప్పదని పలు సర్వేలు అంచనా వేశాయి.ఇప్పుడు విశ్లేషకులు ఊహించినట్లుగానే ఫలితాలు వచ్చాయి.







