ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే.. తండేల్ హిట్టవుతుందా?

ప్రతివారం లాగే ఈ వారం కూడా సందడి చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి.మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయానికి వస్తే.

 February First Week Movies Thandel, Thandel, February First Week, Movies Release-TeluguStop.com

మగిల్ తిరుమేని( Magil Thirumeni ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం విడాముయార్చి( vidamuyarchi ).అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల కానుంది.ఇందులో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అజర్‌బైజాన్‌ ( Azerbaijan )నేపథ్యంగా సాగే ఈ యాక్షన్‌ కథలో అజిత్‌( Ajith ) రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ లోని కారు ఛేజింగ్‌ సీన్స్, పోరాట సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

Telugu February, Thandel, Web-Movie

ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.నాగచైతన్య ,సాయి పల్లవి కలిసి నటించిన తాజా చిత్రం తండేల్( Tandel ).చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా కనిపించబోతున్నారు నాగచైతన్య.ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్ లు సినిమాపై అంజనాలను భారీగా పెంచేసాయి.

సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఒక కథ ప్రకారం.వినోద్ కుమార్ విజయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.న్యాయవాదిగా సాయిరాం పోలీసు అధికారిగా సముద్రఖని ఇందులో నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది.

ఈ మూడు సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి.

Telugu February, Thandel, Web-Movie

ఇకపోతే ఓటిటిలో సందడి చేయబోతున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే. అనుజా ( Anuja )అనే సినిమా నెట్ ఫిక్స్ లో ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఆడం జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మతగా వ్యవహరించారు.

అలాగే సెలబ్రిటీ బేర్‌ హంట్‌ అనే హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 5 నుంచి నెట్టి ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ప్రిజన్‌ సెల్‌ 211 అనే హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌ పిబ్రవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ది ఆర్‌ మర్డర్స్‌ అనే హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌ కూడా ఫిబ్రవరి 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.కోబలి అనే తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

బడా నామ్ కరేంగే అనే హిందీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.మిసెస్ అని హిందీ సినిమా జీ ఫైవ్ లో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

దీని మొహతా బాయ్స్ అనే హిందీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube