ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే.. తండేల్ హిట్టవుతుందా?
TeluguStop.com
ప్రతివారం లాగే ఈ వారం కూడా సందడి చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి.
మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయానికి వస్తే.
మగిల్ తిరుమేని( Magil Thirumeni ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం విడాముయార్చి( Vidamuyarchi ).
అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల కానుంది.
ఇందులో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.అజర్‌బైజాన్ ( Azerbaijan
)నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ కథలో అజిత్( Ajith ) రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ లోని కారు ఛేజింగ్ సీన్స్, పోరాట సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి.
"""/" /
ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
నాగచైతన్య ,సాయి పల్లవి కలిసి నటించిన తాజా చిత్రం తండేల్( Tandel ).
చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా కనిపించబోతున్నారు నాగచైతన్య.ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్ లు సినిమాపై అంజనాలను భారీగా పెంచేసాయి.
సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఒక కథ ప్రకారం.
వినోద్ కుమార్ విజయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.న్యాయవాదిగా సాయిరాం పోలీసు అధికారిగా సముద్రఖని ఇందులో నటించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది.ఈ మూడు సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి.
"""/" /
ఇకపోతే ఓటిటిలో సందడి చేయబోతున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే.అనుజా ( Anuja )అనే సినిమా నెట్ ఫిక్స్ లో ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆడం జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మతగా వ్యవహరించారు.
అలాగే సెలబ్రిటీ బేర్ హంట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి నెట్టి ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రిజన్ సెల్ 211 అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ పిబ్రవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ది ఆర్ మర్డర్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ కూడా ఫిబ్రవరి 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
కోబలి అనే తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
బడా నామ్ కరేంగే అనే హిందీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
మిసెస్ అని హిందీ సినిమా జీ ఫైవ్ లో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దీని మొహతా బాయ్స్ అనే హిందీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.