నాగచైతన్య తండేల్ మూవీకి టికెట్ రేట్ల పెంపు ఉంటుందా.. క్లారిటీ ఇదేనంటూ?

నాగచైతన్య చందూ (Naga Chaitanya,Chandoo Mondeti )మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ ( thandel)మూవీ థియేటర్లలో మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది.

 Ticket Rates Hike For Thandel Movie Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో తండేల్ మూవీకి టికెట్ (Ticket for the movie Thandel)రేట్ల పెంపు ఉంటుందని తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ల పెంపు ఉండబోదని తెలుస్తోంది.

సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన మూడు సినిమాలకు టికెట్ రేట్లు పెంచారనే సంగతి తెలిసిందే.

పెంచిన టికెట్ రేట్లు మూడు సినిమాలకు ఒక విధంగా ప్లస్ అయ్యాయి.తండేల్ సినిమాకు ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఒక్క సీక్వెన్స్ కోసమే 18 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మేకర్స్ చెప్పుకొచ్చారు.నాగచైతన్య, చందూ మొండేటి, దేవిశ్రీ ప్రసాద్, సాయిపల్లవి(Naga Chaitanya, Chandu Mondeti, Devi Sri Prasad, Sai Pallavi) పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.

Telugu Chandoo Mondeti, Chandu Mondeti, Devi Sri Prasad, Naga Chaitanya, Sai Pal

నాగచైతన్య మార్కెట్ ను మించి తండేల్ మూవీకి ఖర్చైన నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు.అయితే ఈ పెంపు పరిమితంగానే ఉంటుందని మరీ భారీగా అయితే ఉండదని భోగట్టా.తండేల్ సినిమాకు హిట్ టాక్ వస్తే టికెట్ రేట్లు పెంచినా సమస్య కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తండేల్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Chandoo Mondeti, Chandu Mondeti, Devi Sri Prasad, Naga Chaitanya, Sai Pal

నైజాంలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఉండబోవని క్లారిటీ వచ్చేసింది.అందువల్ల ఏపీలో మాత్రమే టికెట్ రేట్ల పెంపు దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.తండేల్ సినిమాలో కథ, కథనం విషయంలో ట్విస్టులు ఉండనున్నాయని ఫిబ్రవరి బిగ్గెస్ట్ హిట్ గా నాగచైతన్య తండేల్ నిలిచే ఛాన్స్ ఉందని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube