సినిమాల్లో వచ్చిన డబ్బును హీరో రోహిత్ ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా?

రోహిత్.రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరపై వెలుగు వెలిగిన నటుడు.యూత్ ఫుల్ సినిమాలతో యువతను తెగ అట్రాక్ట్ చేశాడు.6 టీన్స్ లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఆ తర్వాత వరుసగా అవకాశాలువచ్చినా.తెలుగు సినీ పరిశ్రమలో ఆయన నిలదొక్కుకోలేకపోయాడు.నెమ్మదిగా వెండి తెరకు దూరం అయ్యాడు.తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 How Actor Rohith Lost His Properties,  Rohith, Tollywood, Girlfriend, Good Boy,-TeluguStop.com

సినిమా కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పాడు.తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పాడు.

తన కెరీర్ ప్రారంభంలో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినట్లు చెప్పాడు.ఒకదాని తర్వాత మరొక సినిమా చేసి కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పాడు.

తొలినాళ్లలో సొంతం, గర్ల్ ఫ్రెండ్, గుడ్ బాయ్, జానకీ వెడ్స్ శ్రీరామ్, కీలుగుర్రం లాంటి హిట్ మూవాస్ చేశాడు.ఆ సినిమాలో డబ్బులు కూడా బాగా సంపాదించాడు.

వాటిని పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు.అయితే ఆ వ్యాపారాలు అనుకున్నంత స్థాయిలో లాభాలు పొందలేదు.

దీంతో ఆయన సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకున్నట్లు చెప్పాడు.అటు కర్నూలు జిల్లా రాజకీయాల్లోకి రావాలని పలువురు రాజకీయనాయకుల నుంచి పిలుపు వచ్చిందని చెప్పాడు.

అయితే వారి ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పాడు.

Telugu Rohith, Girlfriend, Boy, Janakiweds, Keelugurram, Tollywood-Telugu Stop E

కొద్ది కాలం క్రితం తన బంధువులకు తెలిసిన అమ్మాయిని రోహిత్ వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు.1998 నుంచి 2002 మధ్యలో తెలుగు తెరపై చక్కటి నటన కనబరిచి మాయం అయిన రోహిత్ మళ్లీ ఇన్నాళ్లకు జనాల ముందుకు వచ్చాడు.తాజా ఇంటర్వ్యూతోనైనా ఆయన మళ్లీ మంచి సినిమా అవకాశాలు పొందాలని ఆశిద్దాం.గతంతో పోల్చితే చక్కటి సినిమా కెరీర్ ను పొందాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube