టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలకు(To the Mega, Nandamuri, Daggubati, and Akkineni families) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.అయితే మెగా, నందమూరి, దగ్గుబాటి హీరోలు ఈ మధ్య కాలంలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని భారీ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.
అయితే అక్కినేని హీరోలైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్(Nagarjuna, Naga Chaitanya, Akhil) కెరీర్ పరంగా భారీ హిట్లను సొంతం చేసుకోవాల్సి ఉందనే సంగతి తెలిసిందే.
అక్కినేని హీరోలు ప్రూవ్ చేసుకుంటారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.2025 సంవత్సరం ఈ హీరోలకు కెరీర్ పరంగా కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ హీరోలు కనీసం 60 నుంచి 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కుభేర, కూలీ సినిమాల్లో (Kubera, Coolie)కీలక పాత్రల్లో నటిస్తున్న నాగ్ సోలో హీరోగా కొత్త ప్రాజెక్ట్స్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

2025 సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అక్కినేని హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.చైతన్య(chaitanya) తర్వాత మూవీ విరూపాక్ష డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.
వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha) డైరెక్టర్ మురళీ కిషోర్ డైరెక్షన్ లో అఖిల్ (Akhil)కొత్త సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

నాగార్జున తర్వాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అక్కినేని హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో నాగార్జున మాత్రమే కావడం గమనార్హం.
అక్కినేని హీరోల కాంబినేషన్ లో మరిన్ని మల్టీస్టారర్లు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.మరి అక్కినేని హీరోలు మల్టీస్టారర్స్ కు ఓకే చెబుతారేమో చూడాల్సి ఉంది.