టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది.
దాంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.అందులో అందులో భాగంగానే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్లను కూడా విడుదల చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఇప్పటికే విజయ్ కి సంబంధించిన లుక్ విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ లాక్ అయింది.అంతేకాదు ఈ టైటిల్ బిగ్ సర్ ప్రైజ్ తో రివీల్ కాబోతుందని తెలుస్తోంది.VD12 చిత్రానికి కింగ్ డమ్ లేదా ఎంపీరియమ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 7న ఈ సినిమా టైటిల్ లో టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆ రోజున టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఇంకో విశేషం ఏంటంటే ఈ టైటిల్ టీజర్ కు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాయిస్ ఓవర్ అందించనున్నారని వినికిడి.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా టీజర్ స్టార్ హీరో వాయిస్ తో ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ స్టార్ హీరో ఇతనే అంటూ గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి.కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు తిరుపతికి పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది.
నిర్మాత నాగ వంశీ రిక్వెస్ట్ తో ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.నిజం కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఇదే వార్త నిజమైతే ఆ సంతోషం రెట్టింపు అవ్వడం ఖాయం అని తెలుస్తోంది.అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం ఖాయం అని కూడా తెలుస్తోంది.
మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే ఫిబ్రవరి 7 వరకు వేచి చూడాల్సిందే మరి.