యూట్యూబ్ లో ట్రావెల్ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ‘నా అన్వేష్’( Na Anvesh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ దేశాలను తిరుగుతూ అక్కడి విశేషాలను తన యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఆసక్తికరంగా పంచుకుంటూ ఉంటాడు.
అందుకే అతనికి మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు.అతను వీడియోలు పోస్ట్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.
ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్‌లలో ఒకరిగా నా అన్వేష్ నిలిచాడు.అతను ఏ దేశం వెళ్లినా అక్కడి స్థానికులతో, ముఖ్యంగా అమ్మాయిలతో సరదాగా మూవ్ అవుతూ వారి కల్చర్‌ను అందరికీ పరిచయం చేస్తాడు.
అతని మాటలు, సెటైర్లు, కామెడీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.
తాజాగా నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది.
ఆ వీడియోలో, 8 నెలల్లో 8 సినిమాలు నేను హీరోగా రిలీజ్ చేయబోతున్నాను.ఏఐ టెక్నాలజీ( AI Technology ) ఉపయోగించి ఈ సినిమాలను రూపొందించబోతున్నాం అని ప్రకటించాడు.అంతేకాకుండా,”ఇతర స్టార్ హీరోల పేర్లకు ముందు ఏదో ఒక టైటిల్ ఉంటుందిగా.నన్ను కూడా ఏదైనా స్టార్ టైటిల్ పెట్టుకోవాలని ప్రొడ్యూసర్లు సూచించారని తెలిపారు.
కానీ, ఏ స్టార్ పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు.మీరు సజెస్ట్ చేస్తే అదే స్టార్ నా పేరుకు ముందు పెట్టుకుంటాను” అంటూ తన ఫాలోవర్లను అడిగాడు.

ప్రస్తుతం ఇరాన్‌లో( Iran ) ఉన్నానని, అక్కడ పర్షియన్ మూవీ( Persian Movie ) చేయబోతున్నానని, పర్షియన్ అమ్మాయిని హీరోయిన్‌గా నటింపజేస్తున్నానని వెల్లడించాడు.ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది సినిమాలు రిలీజ్ చేయబోతున్నాం.థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా అవుతున్నాయని, అక్కడ కుదరకపోతే ఓటీటీలో ప్రయత్నిస్తామని.అయితే, ఓటీటీలో కూడా విడుదల చేయకపోతే నా యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేస్తాను అని చెప్పాడు.

తాను నటించే సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ రేంజ్‌లో ఉంటాయని నా అన్వేష్ వెల్లడించడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొంత మంది ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంటే, మరికొంత మంది సరదాగా తీసుకుంటున్నారు.ఇప్పటికే అతనికి సినిమా ఇండస్ట్రీలో నటన అవకాశాలు వచ్చినా, తాను ఆసక్తి చూపలేదని పలు వీడియోల్లో తెలిపిన నా అన్వేష్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సినిమాలు చేయనున్నట్టు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.ఇది నిజంగానే జరుగుతుందా లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం నా అన్వేష్ షేర్ చేసిన ఈ వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.అతనికి ఫ్యాన్స్ ‘స్టార్’ బిరుదులు సూచిస్తుంటే, మరికొంత మంది సినిమాలకు టైటిల్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు.
ఈ ఎనిమిది నెలల్లో నిజంగానే ఎనిమిది సినిమాలు వస్తాయా? నా అన్వేష్ హీరోగా ప్రేక్షకులను మెప్పించగలడా? అన్నది చూడాలి.







