అందరి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు( Coriander Seeds ) ఒకటి.ధనియాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
అందువల్ల వంటల రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ధనియాలు అనేక లాభాలను చేకూరుస్తుంది.వన్ టేబుల్ స్పూన్ ధనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం అలవాటు చేసుకోండి.
రెగ్యులర్ గా ఇలా చేశారంటే ధనియాల్లో ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది.మలబద్ధకాన్ని తరిమికొడుతుంది.
గ్యాస్, అజీర్తి వంటి సమస్య నుంచి రక్షిస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ధనియా వాటర్( Coriander Water ) చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పొటాషియం మెండుగా ఉండటం వల్ల ధనియాలు హై బీపీని( High BP ) అదుపులో ఉంచుతాయి.అలాగే జలుబు, గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నవారు ఒక స్పూన్ ధనియాలను కొద్దిగా జీలకర్ర, అల్లం కలిపి గ్లాస్ నీటిలో మరిగించి తాగితే ఆయా సమస్యలన్ని దూరం అవుతాయి.

షుగర్ పేషెంట్స్( Sugar Patients ) రెగ్యులర్ గా ధనియా వాటర్ తాగడం ఎంతో ప్రయోజనకరం.నైట్ నిద్రించే ముందు ధనియాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ధనియాల్లో పుష్కలంగా ఉంటాయి.రోజుకు ఒక స్పూన్ ధనియాలను నానబెట్టి లేదా కషాయం రూపంలో తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు దరి చేకుండా ఉంటాయి.

అంతేకాదండోయ్.మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెమరీ పవర్‌ను మెరుగుపరచడంలో ధనియాలు సహాపడతాయి.ఒత్తిడిగా ఉన్నప్పుడు ధనియాలతో కషాయం తయారు చేసుకుని తీసుకుంటే మంచి రిలీఫ్ లభిస్తుంది.అయితే ఆరోగ్యానికి మంచిదని అవసరానికి మించి తీసుకుంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి.
లో బీపీ ఉన్నవారు ధనియా వాటర్ ను ఎవైడ్ చేయాలి.ధనియాలు హార్మోన్లను ప్రభావితం చేసే లక్షణాలు కలిగి ఉండటంతో గర్భిణీలు ఎక్కువగా తీసుకోకూడదు.