చరణ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఫిక్స్.. అలా ఉండబోతుందా?

టాలీవుడ్ మెగాహీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Crazy Buzz Global Star Ram Charan With Sandeep Reddy Vanga Details, Ram Charan,-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అదే ఊపుతో గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ వచ్చింది.

బోలెడన్ని అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.అభిమానులు ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాలి.

Telugu Buchibabu, Crazy Buzz, Sandeepreddy, Game Changer, Ram Charan, Ramcharan,

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టకపోవడంతో మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం చెర్రీ చేతిలో రెండు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.గేమ్ చేంజర్ సినిమా విడుదల కాకముందే రెండు సినిమాలను లాక్ చేసి ఉంచారు రామ్ చరణ్.ఈ సినిమాలలో దర్శకుడు బుచ్చిబాబు( Buchibabu ) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతుండగా, మరొక సినిమా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో చేయబోతున్నారు రామ్ చరణ్.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ తదుపరి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Buchibabu, Crazy Buzz, Sandeepreddy, Game Changer, Ram Charan, Ramcharan,

రామ్ చరణ్ ఇప్పటికే కమిట్ అయిన రెండు సినిమాల నుంచి కొత్త ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఉండవచ్చని స్ట్రాంగ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది.ఈ ప్రాజెక్టు ఎవరితోనో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తో.( Sandeep Reddy Vanga ) సుకుమార్ తో ప్రాజెక్ట్ తర్వాత ఈ మెంటల్ మాస్ కాంబినేషన్ ఉండవచ్చని ఇపుడు సమాచారం.మరి ఇదే కానీ నిజం అయితే అభిమానులకి ట్రీట్ నే ఉంటుంది అని చెప్పవచ్చు.

మరి చూడాలి ఈ కలయిక జరుగుతుందో లేదో అనేది.ప్రస్తుతం సందీప్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ కు సంబంధించిన ఆ సినిమా పనులు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి.

మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube