భారత సంతతి గాయనికి గ్రామీ అవార్డ్ .. ఎవరీ చంద్రికా టాండన్?

సంగీత ప్రపంచం ప్రతిష్టాత్మకంగా భావించే 67వ గ్రామీ అవార్డుల(Grammy Awards) ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో (Los Angeles, USA)ఘనంగా జరిగింది.ప్రపంచ నలుమూలల నుంచి ప్రఖ్యాత గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

 Indian-origin Chandrika Tandon Wins Grammys 2025, Chandrika, Chandrika Tandon ,-TeluguStop.com

ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ గ్రామీ అవార్డ్‌ను (Chandrika Tandon wins Grammy Award)అందుకున్నారు.ఆమె రూపొందించిన త్రివేణి ఆల్బమ్‌ ‘‘ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ ’’గా అవార్డును కైవసం చేసుకుంది.

ఏడు ట్రాక్‌లు ఉన్న ఈ ఆల్బమ్ గతేడాది ఆగస్ట్ 30న విడుదలై, సంగీత ప్రియుల మన్ననలు పొందింది.

Telugu Chandrika, Chandrikatandon, Pepsicoceo, Grammy Awards, Grammys-Telugu Top

పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయీకి చంద్రికా టాండన్(Former PepsiCo CEO Indra Nooyi ,Chandrika Tandon) స్వయానా సోదరి.చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన టాండన్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ ఎక్కువ.తల్లి సంగీత విద్వాంసురాలు కావడం కూడా సంగీతంపై ఆసక్తికి కారణమైంది.

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన చంద్రికా టాండన్(Chandrika Tandon).వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.ఇది ఆమె జీవితంలో రెండో గ్రామీ అవార్డ్.గ్రామీ అవార్డ్‌కు ఎంపిక కావడంపై చంద్రికా టాండన్ స్పందించారు.తనతో పాటు ఎంతో మంది గాయనీ గాయకులు ఈ విభాగంలో నామినేట్ అయ్యారని , తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చంద్రికా టాండన్ ధన్యవాదాలు తెలిపారు.

Telugu Chandrika, Chandrikatandon, Pepsicoceo, Grammy Awards, Grammys-Telugu Top

కాగా.అమెరికా మాజీ అధ్యక్షుడు , దివంగత జిమ్మీకార్టర్‌కు మరణానంతరం గ్రామీ అవార్డ్‌ (Grammy Award)వరించింది.ఆయన రచించిన ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్‌కు బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు.

జిమ్మీకార్టర్ తరపున ఆయన మనవడు జేసన్ కార్డర్ గ్రామీ అవార్డును అందుకున్నారు.జిమ్మీ జీవించి ఉన్న రోజుల్లో మూడు గ్రామీ అవార్డులను అందుకోగా.తాజాది నాలుగోది.జిమ్మీకార్టరే కాకుండా అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌లు కూడా గ్రామీ అవార్డులు అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube