ఒక దేశం వాళ్లు పరాయి దేశం వాళ్లతో ప్రేమలో పడటం కామనైపోయింది.అదేవిధంగా 33 ఏళ్ల ఒనిజా రాబిన్సన్( Onijah Robinson ) అనే అమెరికన్ మహిళ.
పాకిస్థాన్‌కు( Pakistan ) చెందిన 19 ఏళ్ల నిదాల్ అహ్మద్ మీనన్‌తో( Nidal Ahmed Memon ) ఆన్‌లైన్‌లో ప్రేమలో పడింది.అంతే, లవ్ బర్డ్స్‌లా కలిసిపోవాలని ఫిక్స్ అయిపోయింది.
ఇంకేముంది 2024, అక్టోబర్‌లో పాకిస్థాన్ చెక్కేసింది.కరాచీలో( Karachi ) దిగి తన ప్రియుడు నిదాల్ కోసం వెతికింది.
కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది, నిదాల్ ఫ్యామిలీ ప్రెజర్ వల్ల అమ్మాయిని కలవడానికి ససేమిరా అన్నాడు.దీంతో ఒనిజా ఒక్కసారిగా షాక్ తిన్నది.
అప్పటికే టూరిస్ట్ వీసా గడువు కూడా అయిపోయింది.దిక్కుతోచని స్థితిలో నిదాల్ ఇంటి ముందే టెంట్ వేసుకుని కూర్చుంది.
కానీ ఇల్లు ఖాళీగా ఉండటంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంతలో యాక్టివిస్ట్, యూట్యూబర్ జఫర్ అబ్బాస్ ఈ స్టోరీని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అందరికీ తెలిసింది.
సింధ్ గవర్నర్ కామ్రాన్ ఖాన్ టెస్సోరి వెంటనే స్పందించారు.ఆమె వీసా గడువును పొడిగించడమే కాకుండా, తిరిగి అమెరికా( America ) వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఏర్పాటు చేశారు.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అమ్మాయి క్షేమంగా ఇంటికి వెళ్తుందని అనుకున్నారు.
కానీ అమెరికా వెళ్ళనని ఒనిజా తెగేసి చెప్పింది.అంతేకాదు.
షాకింగ్ డిమాండ్స్ చేయడం మొదలుపెట్టింది.

తన ప్రియుడు నిదాల్ వారానికి 3 వేల డాలర్లు (మన కరెన్సీలో 9 లక్షల రూపాయలు) ఇవ్వాలని డిమాండ్ చేసింది.పాకిస్థాన్ పౌరసత్వం కూడా కావాలంది.అంతేకాదు.
తాను నిదాల్ భార్యనని కూడా చెప్పుకొచ్చింది.ఇది చాలదన్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తనకు లక్ష డాలర్లు ఇవ్వాలని, వెంటనే 20 వేల డాలర్లు క్యాష్‌గా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
పాకిస్థాన్ రోడ్లు, రవాణా వ్యవస్థ బాగాలేదని, దేశాన్ని మళ్లీ నిర్మిస్తానంటూ కామెంట్స్ చేసింది.ఆమె డిమాండ్స్ విన్నవాళ్లంతా అవాక్కయ్యారు.

అసలు విషయం ఏంటంటే, ఒనిజా బైపోలార్ డిజార్డర్‌తో( Bipolar Disorder ) బాధపడుతోందని ఆమె కొడుకు జెరెమియా ఆండ్రూ రాబిన్సన్ చెప్పాడు.తన తల్లిని అమెరికాకు తిరిగి రమ్మని తాము చాలా బతిమలాడామని, కానీ ఆమె వినలేదని వాపోయాడు.అమెరికా కాన్సులేట్ ఫ్లైట్ ఏర్పాటు చేసినా, ఆమె వెళ్లడానికి లేట్ చేయడంతో ఫ్లైట్ ఏకంగా 36 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.కొడుకు చెప్పిన మాటలు నిజమేనని తేలడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఒనిజాను కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌లోని సైకియాట్రిక్ వార్డులో చేర్పించింది.
ఆమెకు మానసిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.మరోవైపు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నిదాల్ అహ్మద్ మీనన్‌ను అరెస్ట్ చేసింది.ఈ స్టోరీ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.