సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోయిన సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి.విడిపోయి ఆ తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
వారిలో నమ్రత( Namrata ) మహేష్( Mahesh Babu ) లు కూడా ఒకరు.నమ్రత మహేష్ లు విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఏంటా అని అనుకుంటున్నారా.
మీరు విన్నది నిజమే.మహేష్-నమ్రత కూడా విడిపోయారు.
కానీ మిగతావాళ్లలా కాకుండా, కొన్నాళ్లకు మళ్లీ కలిశారట.కాగా ఇదే విషయాన్ని నమ్రత స్వయంగా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.

మహేష్ కెరీర్ లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు.అదే సమయంలో నేను కూడా నా తల్లి దండ్రుల్ని కోల్పోయాను.మా మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయి.
కొడుకు గౌతమ్ ను( Gowtam ) తీసుకొని నేను ముంబై కీ వచ్చేశాను.కొన్నాళ్లు మేం విడిపోయాము.
అయితే ఆ విడిపోవడంతోనే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకున్నాము.అలా తెలుసుకున్న తర్వాత తిరిగి కలుసుకున్నట్టు వెల్లడించారు నమ్రత.
విడిపోయి కలుసుకున్న తర్వాతే సితార( Sitara ) జన్మించింది.అంతేకాదు మహేష్ వల్ల తన కెరీర్ ను పక్కన పెట్టిన విషయాన్ని కూడా నమ్రత బయటపెట్టారు.

పెళ్లి తర్వాత నేను పనిచేయాలని మహేష్ కోరుకోలేదు.రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు.హీరోయిన్ గా ఉన్నానని కాదు, నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ మహేష్ నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు.స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు.
అందుకే కెరీర్ ఆపేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు అని నమ్రత చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా నమ్రత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇండస్ట్రీలో విడిపోవడం అన్నది కామన్ కానీ విడిపోయి మళ్ళీ కలిసి ఉండడం అన్నది చాలా రేర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.