పెళ్లికి ముందే మహేష్ బాబు ఆ షరతు విధించాడు.. నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోయిన సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి.
విడిపోయి ఆ తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.వారిలో నమ్రత( Namrata ) మహేష్( Mahesh Babu ) లు కూడా ఒకరు.
నమ్రత మహేష్ లు విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఏంటా అని అనుకుంటున్నారా.
మీరు విన్నది నిజమే.మహేష్-నమ్రత కూడా విడిపోయారు.
కానీ మిగతావాళ్లలా కాకుండా, కొన్నాళ్లకు మళ్లీ కలిశారట.కాగా ఇదే విషయాన్ని నమ్రత స్వయంగా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ. """/" /
మహేష్ కెరీర్ లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు.
అదే సమయంలో నేను కూడా నా తల్లి దండ్రుల్ని కోల్పోయాను.మా మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయి.
కొడుకు గౌతమ్ ను( Gowtam ) తీసుకొని నేను ముంబై కీ వచ్చేశాను.
కొన్నాళ్లు మేం విడిపోయాము.అయితే ఆ విడిపోవడంతోనే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకున్నాము.
అలా తెలుసుకున్న తర్వాత తిరిగి కలుసుకున్నట్టు వెల్లడించారు నమ్రత.విడిపోయి కలుసుకున్న తర్వాతే సితార( Sitara ) జన్మించింది.
అంతేకాదు మహేష్ వల్ల తన కెరీర్ ను పక్కన పెట్టిన విషయాన్ని కూడా నమ్రత బయటపెట్టారు.
"""/" /
పెళ్లి తర్వాత నేను పనిచేయాలని మహేష్ కోరుకోలేదు.రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు.
హీరోయిన్ గా ఉన్నానని కాదు, నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ మహేష్ నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు.
స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు.అందుకే కెరీర్ ఆపేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు అని నమ్రత చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా నమ్రత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇండస్ట్రీలో విడిపోవడం అన్నది కామన్ కానీ విడిపోయి మళ్ళీ కలిసి ఉండడం అన్నది చాలా రేర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.