టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Nandamuri hero Kalyan Ram ) ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు కళ్యాణ్ రామ్.
ఒకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు హీరోగా సినిమాలలో నటిస్తున్నారు.కాగా కళ్యాణ్ రామ్ చివరగా బింబిసారా, డెవిల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.ఇకపోతే ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి( Son of Vyjayanthi ) అనే టైటిల్ ని పెట్టారు.సినిమాలో వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి ఆమె కొడుకు అర్జున్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు.టైటిల్ కు న్యాయం చేస్తూ తల్లి కొడుకు పాత్రలను రెండింటినీ కలిపి పోస్టర్ వేసినట్టు తెలుస్తోంది.ఇదివరకే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్స్ పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.ఈ సినిమా ఏదో ఒక మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగానే నడుస్తోంది.
ఈ సినిమా మరొక పటాస్ లేదంటే మరొక బింబిసార అవుతుందనే పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో ఒక్క పాట హిట్ అయితే కనుక ఈ సినిమా కరెక్ట్ ట్రాక్ లో పడినట్టే అని చెప్పాలి.ప్రదీప్ చిలుకూరి( Pradeep Chilukuri ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటారు చూడాలి మరి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.