Hair Fall Spary: హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టి చుండ్రును తరిమికొట్టే పవర్ఫుల్ హోం మేడ్ స్ప్రే మీకోసం!

జుట్టు రాలడం, చుండ్రు అనేవి కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యలు.అయితే ఇవి కొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి.

 A Powerful Homemade Spray That Stops Hair Fall And Get Rid Of Dandruff! Hair Fal-TeluguStop.com

దాంతో వాటికి అడ్డుకట్ట వేయడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.ఒకవేళ మీరు కూడా ఈ జాబితాలో ఉంటే అస్సలు వర్రీ అవకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోం మేడ్ హెయిర్ స్ప్రే గనుక వాడితే హెయిర్ ఫాల్ కు చెక్‌ పెట్టడమే కాదు చుండ్రు సమస్యను సైతం చాలా సులభంగా మరియు వేగంగా తరిమికొట్టొచ్చు.మరి ఇంతకీ ఆ హెయిర్ స్ప్రే ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఐదు నుంచి ఆరు మందార ఆకులు మరియు నాలుగు మందార పూలను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే మందార ఆకులు మరియు పువ్వులను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ వేసి వాటర్ సగం అయ్యే వరకు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్‌ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వేప నూనెను వేసి బాగా మిక్స్ చేస్తే మన స్ప్రే సిద్ధం అయినట్టే.ఈ వాటర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

ఆపై జుట్టు కుదుళ్లకు స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ హెయిర్ స్ప్రే ను ఉపయోగించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Spray, Homemade Spray, Long-Telugu Healt

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ పవర్ ఫుల్‌ హోమ్ మేడ్ హెయిర్ స్ప్రే ని వాడితే కనుక జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.చుండ్రు సమస్య దూరం అవుతుంది.మరియు మందార ఆకులు మరియు పూలలో ఉండే ప్రత్యేక సుగుణాలు కురులు ఒత్తుగా పెరిగేందుకు ఎంతగానో సహాయపడతాయి.కాబట్టి హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యల‌తో బాధపడేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ హెయిర్ స్ప్రేను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube