ఈ మధ్య కాలంలో సరోగసి లో పిల్లలను కనే హీరోయిన్స్ ఎక్కువ అవ్వడం తో అందరు అలాగే ఉంటారు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు మన ఫేక్ రాయుళ్లు.ఇలా మెగా స్టార్ తన కుమారుడు కోడలు అమ్మ నాన్న అవ్వబోతున్నారు అనే విషయం తెలిసిన మరుక్షణం నుంచే ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతుంది అనే వార్త విచ్చల విడిగా వినిపిస్తుంది.
ఆ రోజు నుంచి మనం ఇదివరకు ఆర్టికల్స్ లో ఆ న్యూస్ ఖండిస్తూనే ఉన్నాం.అరె చాల మంది లాగ ఆమె సాదా సీదా మనిషి కాదు.
రెండు అత్యుత్తమ కుటుంబాలకు చెందిన వారసురాలు.అటు అమ్మ అయితేనేమి ఇటు నాన్న అయితేనేం.
అందరు చాల గొప్ప వారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె రాజా వంశస్థుల కుటుంబంలో పుట్టింది.వారి కోట మనం ఇప్పటికే చాల సార్లు చూసాం.

అంత ఉత్తమ కుటుంబం లో పుట్టి మెగా స్టార్ ఇంటికి కోడలు గా మారక ఆమె విలువ ఆలోచించే విధానం చాల మారింది కానీ తక్కువ గా ఆలోచించడు.అంత ఈజీ గా ఎవరో బిడ్డను కానీ ఇవ్వాలని ఉపాసన నిర్ణయించుకునే అవకాశమే ఉండదు.పైగా నిన్న ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.అటు తన కామినేని వంశాన్ని ఇటు తన తల్లి తరపు వారందరిని ఒక చోట చేర్చి తాను తల్లి కాబోతున్నందుకు అందరిని కలిసినట్టుగా, ఆ సమయంలో తన జీవితంలో ముఖ్య పాత్రా పోషిస్తున్న మహిళలు వీరే అంటూ చెప్పింది.
చరణ్ తల్లిని మిస్ అవుతున్నట్టు కూడా మిస్సింగ్ అత్తమ్మ అని రాసుకచ్చింది.

తల్లిని కాబోతున్న సందర్భం లో ప్రతి క్షణం ఎంతో మధురానుభూతుల్ని పంచుతుంది అనే భావం వచ్చేలా ఆమె పోస్టింగ్ ఉంది.దాన్ని బట్టి చూస్తే ఆమె స్వయంగా గర్భవతి అవ్వడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపించింది.అంతే కానీ సరోగసీ ద్వారా బిడ్డను కనే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు.
పైగా ఆమె నిర్మయాలు చాల ఖచ్చితంగా ఉంటాయి.పెళ్లయిన తర్వాత ఆమె లుక్స్ తో రామ్ చరణ్ మ్యాచ్ కాలేదు అని కొన్ని కామెంట్స్ వినిపిస్తే ఆమెను ఆమె ఎలా మలుచుకుందో మనం స్వయంగా చూసాం.
అందుకే ఉపాసన చాల గ్రేట్.