ఎన్ని చేసినా చుండ్రు పోవ‌డం లేదా? ముల్లింగితో ఇలా చేస్తే సరి!

చుండ్రు ప‌ట్టుకుందంటే.వ‌ద‌ల‌నే వ‌ద‌లదు.

ఎన్ని షాంపూలు మార్చినా, ఖ‌రీదైన ఆయిల్స్ వాడినా, హెయిర్ ప్యాకులు వేసుకున్నా ఫ‌లితం ఉండ‌దు.

దాంతో కొంద‌రు చుండ్రును వ‌దిలించుకునేందుకు ట్రీట్‌మెంట్ వ‌ర‌కు వెళ్తారు.

ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.కానీ, ఇంట్లో స‌రైన చిట్కాలు పాటిస్తే.

చాలా సుల‌భంగా మ‌రియు త్వ‌ర‌గా చుండ్రును నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా చుండ్రును పోగొట్ట‌డంలో ముల్లంగి అద్భుతంగా సహాయ‌ప‌డుతుంది.

Advertisement

మ‌రి జుట్టుకు ముల్లంగిని ఎలా వాడాలో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ముల్లింగిని తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ముల్లంగి ర‌సం, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.

అర గంట అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువగా ఉండే షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గి పోతుంది.

అలాగే ముల్లింగిని మెత్త‌గా పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా బాదం ఆయిల్ వేసి క‌ల‌పాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌లపై అప్లై చేసి.ముప్పై, న‌ల‌బై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

Advertisement

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే.

చుండ్రు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.మ‌రియు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇక ముల్లింగిని తొక్క తీసి మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ ర‌సాన్ని దూది సాయంతో త‌ల‌పై పూయాలి.అర గంట పాటు ఆర‌నిచ్చి.

ఆ త‌ర్వాత మామూలు షాంపూతో త‌ల స్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా చుండ్రు పోతుంది.

తాజా వార్తలు