తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి.
ఇక ఇప్పుడు ఆయన వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు.ఇక అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఉస్తది భగత్ సింగ్, ఓ జి సినిమాలు తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
అయితే ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ముఖ్యంగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) మీద చాలామందికి చాలా అంచనాలైతే ఉన్నాయి.ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.కాబట్టి కమర్షియల్ సినిమాలను హరీష్ శంకర్( Harish Shankar ) చాలా బాగా తీస్తాడు.
అందువల్లే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.మరి అందరూ కోరుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఓజి సినిమా( OG Movie ) కూడా ఒక టీజర్ తో మంచి హైప్ ని పెంచుకున్నప్పటికీ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నాడు అనేది కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తుంది.ఇక ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అందుకే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు.కాబట్టి ఈ సినిమాకి ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
.