క్యాంపస్‌లో వేర్పాటువాద కాశ్మీరీ జెండాను( Separatist Kashmiri Flag ) ప్రదర్శించడాన్ని అనుమతించవద్దని న్యూజెర్సీలోని రట్జర్స్ యూనివర్సిటీ( Rutgers University ) ఛాన్స్‌లర్‌కు విజ్ఞప్తి చేశాయి ప్రముఖ భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సంస్థలు.ఇది ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రస్తుతం యూఎస్ విద్యాసంస్థల్లో నిరసనల మధ్య తప్పుడు సందేశాన్ని పంపుతుందని పేర్కొన్నాయి.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా గత కొన్నిరోజులుగా అమెరికాలోని( America ) ప్రముఖ యూనివర్సిటీల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడటంతో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో 2007 నుంచి గాజాను పాలిస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ ‘హమాస్’ పై( Hamas ) ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది.
అయితే ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం అగ్రరాజ్యానికి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.ఇజ్రాయెల్‌కు( Israel ) మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు( Palestine ) మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.
యేల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ నిరసనల్లో అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు , యువత పాల్గొంటున్నారు.
దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ఈ శుక్రవారం నిరసన చేస్తున్న విద్యార్ధులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక బృందం తమ 10 డిమాండ్లలో ఎనిమిదింటిని రట్జర్స్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పరిష్కరించిందని తెలిపింది.
డిమాండ్లలోని 9వ పాయింట్ ప్రకారం.రట్జర్స్ క్యాంపస్ అంతటా పాలస్తీనా, కుర్దులు, కాశ్మీరీలకు పరిమితం చేయబడిన ఆక్రమిత ప్రజల జెండాలను ప్రదర్శించవచ్చు.అయితే నిరసనకారుల డిమాండ్లను యూనివర్సిటీ అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాలు మీడియాకు తెలిపాయి.రట్జర్స్ న్యూ బ్రున్స్విక్ క్యాంపస్‌లో ప్రదర్శించబడిన జెండాలను ఛాన్సలర్ కార్యాలయం పరిశీలిస్తుందని పేర్కొంది.యూనివర్సిటీలో నమోదైన విద్యార్ధులకు తగిన ప్రాతినిథ్యం వుండేలా చూస్తామని స్పష్టం చేసింది.
ఈ పరిణామాలు పలు ప్రవాస భారతీయ సమూహాలకు ఆగ్రహం తెప్పించాయి.
ఈ క్రమంలోనే క్యాంపస్‌లో వేర్పాటువాద కాశ్మీరీ జెండాను ప్రదర్శించకుండా చూడాలని వర్సిటీని కోరాయి.ఈ డిమాండ్‌ను పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా భారతదేశ సమగ్రతను ప్రశ్నిస్తున్నారని ఓ కమ్యూనిటీ నేత మండిపడ్డారు.
కాశ్మీర్( Kashmir ) భారతదేశంలో అంతర్భాగమని.దానికి ప్రత్యేకంగా జెండా లేదని, కశ్మీరీలు నిర్వాసితులేమీ కాదని ఆయన చురకలంటించారు.
వాస్తవానికి నిర్వాసితులైన ప్రజలు హిందూ మైనారిటీలని.హింసాకాండ కారణంగా వారు కాశ్మీర్‌ను విడిచిపెట్టాల్సి వచ్చిందని గుర్తుచేశారు.