‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?

తెలుగు ఇండస్ట్రీలో కిరణ్ అబ్బురవరం(kiran abburavaram) హీరోగా నటించిన ‘క’ (KA) సినిమా మొదటి రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్(HIT TALK) తో చాలా వేగంగా దూసుకుపోతుంది.

 Where Is The Town Shown In The Movie 'ka' Really, Ka Movie ,mystery Village, Kir-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా చేసిన సంగతి అందరికీ వివిధమే.అయితే ఈ ‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది.క సినిమాలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి అవుతుందని చూపించిన విధంగానే ఓ గ్రామం నిజంగానే ఉంది.అది ఎక్కడో కాదు మన తెలంగాణలోని పెద్దపల్లికి(Peddapalli) 10 కిలోమీటర్లలో ఉన్న ఆ ఊరిని ‘మూడు జాముల కొదురుపాక‘(Mudujamula Kodurupaka) అని అందరూ అంటారు.

Telugu Ka, Latest, Mystery, Peddapalli, Telangana-Latest News - Telugu

ఆ ఊరిలో ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు జాములే ఉంటాయి.సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ చీకటి అవుతుంది.దీనికి కారణం నాలుగు దిక్కులా ఎత్తైన కొండలు.మధ్యలో ఊరు ఉండడంతో సూర్యుడు కొండల వెనకాల వెళ్లి ఆ నీడ పడి త్వరగా ఆ ఊరు చీకటిలో ఉంటుంది.

అంతేకాకుండా, ఈ గ్రామంలో సూర్యాస్తమం కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని అక్కడి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండడం వల్ల ఆ కొండల సూర్యరశ్మికి అడ్డంగా పడతాయి.

ఈ ప్రకృతికి అలవాటు పడిన అక్కడ గ్రామస్తులు వారి జీవనాన్ని సుఖంగా కొనసాగిస్తూ ఉన్నారు.ఇక ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు అందరూ వాతావరణన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube