అమెరికా అధ్యక్ష ఎన్నికలు : తమిళనాడులోని ఆ గ్రామంలో పండుగ వాతావరణం

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.ఎన్నో అంచనాల మధ్య నేడు అగ్రరాజ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

 Us Presidential Election 2024 : Kamala Harris' Ancestral Village In India Excite-TeluguStop.com

డెమొక్రాటిక్ పార్టీ(Democratic Party) తరపున కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ (Republican Party)తరపున డొనాల్డ్ ట్రంప్‌లు(Donald Trumps) అధ్యక్ష బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.

అగ్రరాజ్య చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలిగా, తొలి భారత సంతతి నేతగా, తొలి నల్లజాతి నేతగా రికార్డుల్లోకెక్కుతారు.సర్వేలు కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతున్నా.

ట్రంప్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.ఎన్నికల నేపథ్యంలో కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని తులసేంద్రపురంలో పండుగ వాతావరణం నెలకొంది.

రాష్ట్ర రాజధాని చెన్నైకి 300 కి.మీ .వాషింగ్టన్ డీసీకి 14,000 వేల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.కమల తల్లి శ్యామలా గోపాలన్ తల్లిదండ్రులు తులసేంద్రపురానికి చెందినవారు.1958లో అమెరికా వెళ్లడానికి ముందు వరకు శ్యామల తమిళనాడులోనే ఉన్నారు.కమలా హారిస్ (Kamala Harris)తాతయ్య ( శ్యామల తండ్రి) పీవీ గోపాలన్‌(PV Gopalan) భారత స్వాతంత్య్ర సమరయోధుడు.

చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.

Telugu Democratic, Donald Trumps, Kamala Harris, Pv Gopalan, Republican, Preside

నేటికి బహిరంగ వేదికలపై తాతగారు తనకు చెప్పిన మాటలను, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ వుంటారు కమలా హారిస్(Kamala Harris).చెన్నై బీచ్‌లో తాతయ్యతో కలిసి వాకింగ్‌కు వెళ్లడంతో పాటు దక్షిణాది సాంప్రదాయ వంటకాలను రుచి చూడటం తనకెంతో ఇష్టమని కమలా హారీస్ అంటూ వుంటారు.తన తల్లి శ్యామల మరణించిన తర్వాత సోదరి మాయతో కలిసి ఆమె చెన్నైకి వచ్చారు.

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆమె చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు.

Telugu Democratic, Donald Trumps, Kamala Harris, Pv Gopalan, Republican, Preside

తమ గ్రామ మూలాలున్న బిడ్డ ప్రపంచానికే పెద్దన్న లాంటి దేశానికి అధినేత అయ్యే దిశగా అడుగులు వేస్తుండటంతో తులసేంద్రపురం వాస్తవ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.ఊరి మధ్యలో కమలా హారిస్‌ ఫోటోతో కూడిన పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేసి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు.ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కోరుతూ స్థానిక దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.

కమలా హారిస్, ఆమె తల్లిదండ్రుల పేర్లు గ్రామ దేవాలయానికి విరాళాలు ఇచ్చిన దాతల జాబితాలో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube