నిత్యం ఈ పొడిని తీసుకుంటే శరీరంలో కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది!

అధిక కొవ్వు అనేక జబ్బులకు మూలం.కొవ్వు భారీగా పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.

 Taking This Powder Regularly Will Melt All The Fat In Body! Fat, Fat Burner Powd-TeluguStop.com

గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.గుండె ఎప్పుడు దడగా ఉంటుంది.

శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్(Brain stroke) వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది.అధిక కొవ్వు బ్లాడర్ లో రాళ్లు కూడా ఏర్పడేలా చేస్తుంది.

అందువల్ల ఫ్యాట్ ను కరిగించుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Anise, Coriander, Cumin, Fat Powder, Fenugreek, Tips, Healthy Powder, Fat

నిత్యం ఈ పొడిని తీసుకుంటే శరీరంలో కొవ్వు (Fat) మొత్తం వెన్నెలా కరిగిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర (cumin)వేసి వేయించుకొని తీసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు(Anise), నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు(Coriander), నాలుగు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్‌(Kalonji seeds), నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు (Fenugreek)వేసి విడివిడిగా వేయించుకోవాలి.

Telugu Anise, Coriander, Cumin, Fat Powder, Fenugreek, Tips, Healthy Powder, Fat

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మెంతులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, కలోంజి సీడ్స్‌ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.నిత్యం ఉదయం ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో తయారు చేసుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.

Telugu Anise, Coriander, Cumin, Fat Powder, Fenugreek, Tips, Healthy Powder, Fat

ఈ విధంగా ప్రతిరోజు చేశారంటే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు మొత్తం కరిగిపోతుంది.గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం వంటి జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.అంతేకాదు నిత్యం ఈ పొడిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలు సైతం బయటకు తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube