గత వైసిపి ( YCP )ప్రభుత్వంలో మంత్రిగానూ , ఆ తరువాత ఎమ్మెల్యేగా కొనసాగిన కొడాలి నాని పూర్తిగా టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబాన్నే టార్గెట్ చేసుకుంటూనే విమర్శలు చేస్తూ ఉండేవారు.అప్పట్లో నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉండేవి.
ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో కొడాలి నాని( Kodali Nani ) పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఎక్కువ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.
గుడివాడకు రావడం కూడా బాగా తగ్గించేశారు.వైసిపి తరఫున వాయిస్ వినిపించేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.
దీనికి కారణం మళ్లీ తాను యాక్టివ్ అయితే తనను టార్గెట్ చేసుకుని కేసుల్లో ఇరికిస్తారనే భయము కొడాలి నానిలో ఉంది.అయితే కొడాలి నాని వ్యవహారాన్ని టిడిపి అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
ఈ మేరకు టిడిపి కేడర్ నుంచి అధినాయకత్వానికి ఒత్తిడి పెరుగుతోంది.
గత ప్రభుత్వంలో కొడాలి నాని చంద్రబాబు( Chandrababu ) కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దృష్ట్యా ఆషామాషీగా వదిలిపెట్టకూడదని, కచ్చితంగా అరెస్టు చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఇదే విషయంపై అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.దీంతో కొడాలి నాని విషయంలో సీరియస్ గానే వ్యవహరించే విధంగా టిడిపి అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది.
ఈ మేరకు కొడాలి నానిని అరెస్టు చేసి ఆయనపై కేసులు నమోదు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఇటీవల జగనన్న కాలనీలకు సంబంధించి గుడివాడలో గత వైసిపి ప్రభుత్వం సేకరించిన భూముల వ్యవహారానికి సంబంధించి కేసు నమోదయింది.
దీంతో పాటు, అనేకమంది టిడిపి నాయకులు కొడాలి నాని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు .దీంతో కొడాలి నానిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే నాని ని ఆషామాషీగా వదిలి పెట్టకుండా పగడ్బందీగా బెయిల్ దొరకని కేసులు ఆయనపై నమోదు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం .దీనిలో భాగంగానే పాత కేసులను పోలీసులు బయటకు తీసి వాటికి సంబంధించిన అన్ని సాక్షాదారాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.కొడాలి నానితో పాటు, ఆయన ముఖ్య అనుచరుల పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందట .మొన్నటి ఎన్నికల్లో సహకరించిన వారు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కొడాలి నానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నాయకులపైన కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారట.