ప్రతిరోజు సోషల్ మీడియాలో వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము.అయితే అందులో కొన్ని ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండడం గమనిస్తుంటాము.
ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు అది విచారణలో తేలితే వారిని జైలుకు పంపించడం మామూలే.అలా వారి తప్పులకు సంబంధించి న్యాయమూర్తులు వారికి సరైన శిక్షణ విధించడం మామూలే.
ఇలా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లి తిరిగి వస్తుంటారు.అయితే, తాజాగా ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత గేటు బయట చేసిన డాన్స్( Dance ) ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ వీడియోను సమాజ్ వాది పార్టీ ( Samajwadi Party )సీనియర్ నేత ఒకరు సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఉత్తరప్రదేశ్ లోని కొజ్ఞోజ్( Kojnoj in Uttar Pradesh ) ప్రాంతానికి చెందిన శివ( Shiva ) అనే యువకుడు తొమ్మిది నెలల జైలు జీవితం గడిపి విడుదలయ్యాడు.ఓ దాడి కేసులో అతడికి కోర్టు జైలు శిక్ష తోపాటు 1000 రూపాయలు జరిమానాలను విధించింది.అయితే, అతడి కుటుంబ సభ్యులు బెయిల్ ఇవ్వకపోవడంతో అతనికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఓ ఎన్జీవో సహకరించింది.అయితే శివ జైల్లో ఉన్న సమయంలో చదవడం, రాయడం లాంటి పనులు నేర్చుకున్నాడు.
దాంతో అతడు భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యక్రమాలకు పాల్పడమని తెలియజేశారు.ఇంకేముంది బెయిల్ అతడికి లభించింది.బెయిల్ లభించిన తర్వాత అతడు జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో చేసిన డాన్స్ లోని స్కిల్స్ ను చూసి సోషల్ మీడియా వినియోగదారులు మెచ్చుకుంటున్నారు.అతను ఇప్పుడు నుంచి చాలా స్వేచ్ఛగా నిజాయితీగా బతుకుతాడని కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరేమో ఇప్పటినుంచైనా మార్పు తెచ్చుకొని ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.