సంగీతం ఆస్వాదించని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు.మనలో చాలామంది పాటలను వింటూ వారి పనులను చాలా సంతోషంగా చేసేస్తుంటారు.
నిజం చెప్పాలంటే ప్రశాంతంగా చేసే పని సమయంలో కంటే పాటలు లేదా ఏదైనా మంచి సంగీతం వినే సమయంలో చేసే పని చాలా త్వరగా జరిగిపోతూ ఉంటుంది.ఇకపోతే, ప్రస్తుత కాలంలో అనేక రకాల మ్యూజిక్ లు ట్రెండ్ గా మారాయి.
మరొకవైపు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ రావడంతో వివిధ రకాల పాటలు, రింగ్ టోన్స్ ఇలా ఎన్నో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఏనుగు పాటకు తగ్గట్టుగా డాన్స్ చేయడం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.ఈ వీడియోలో ఇద్దరూ అమ్మాయిలు భరతనాట్యం సంబంధించిన స్టెప్స్ వేయడం మనం గమనించవచ్చు.ఇలా వారు డాన్స్ చేసిన సమయంలో వారి వెనుక ఒక పెద్ద ఏనుగు కనపడుతుంది.ఇకపోతే అమ్మాయిలు చాలా అందంగా భరతనాట్యం చేస్తున్న సమయంలో వెనుక ఉన్న ఏనుగు కూడా వారిని అనుసరించింది.
అమ్మాయిలు ఎలా డాన్స్ మూవ్ చేస్తున్నారో అందుకు తగ్గట్టుగా ఏనుగు కూడా తన మొఖం, తొండంను అటు ఇటు కదుపుతూ డాన్స్ చేయడం కనబడుతుంది.ఈ వీడియోలో అమ్మాయిల డాన్స్ కంటే ఏనుగు వేసిన డాన్స్ చూడటానికి చాలామంది ఇష్టపడుతున్నారు.
అంతలా ఏనుగు డాన్స్ మూమెంట్స్ చేసిందంటే నమ్మండి.
ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియాని నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో భాగంగా ఒకరేమో ఇలాంటి అద్భుతమైన డాన్స్ నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో డాన్సర్ల కంటే ఏనుగే బాగా డాన్స్ చేసిందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించి మీకేమనిపిచ్చిందో ఓ కామెంట్ చేయండి.