బన్నీ ,సుకుమార్ ( Bunny, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.పుష్ప ది రూల్ మూవీ( Pushpa the rule movie ) రన్ టైమ్ విషయంలో సైతం ప్రేక్షకులకు అవగాహన వచ్చేసింది.3 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇంత భారీ రన్ టైమ్ వల్ల సింగిల్ స్క్రీన్స్ లో కొంతమేర ఇబ్బందులు తప్పవు కానీ మల్టీప్లెక్స్ లకు మాత్రం ఇబ్బందులు ఉండవు.
పుష్ప ది రూల్ సెన్సార్ రిపోర్ట్ ( Censor report )విషయానికి వస్తే ఫస్టాఫ్ ఎమోషనల్ సీన్స్ తో సెకండాఫ్ యాక్షన్ సీన్స్ తో ఉంటుందని తెలుస్తోంది.సినిమాలో పాటలు ఎక్కువగానే ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
సినిమా బీజీఎం విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా.రేసీ స్క్రీన్ ప్లేతో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారని టామ్ అండ్ జెర్రీ వార్ లా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
పుష్ప3 మూవీ( Pushpa 3 movie ) కూడా కచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.అయితే పుష్ప3 సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.పుష్ప3 మూవీలో రష్మిక ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.పుష్ప ది రూల్ రష్మికకు మెమరబుల్ మూవీ అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.పుష్ప2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పుష్ప ది రూల్ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీ అయ్యేలా బన్నీ ప్లానింగ్స్ ఉన్నాయని బోగట్టా.పుష్ప ది రూల్ మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పుష్ప ది రూల్ సినిమా నిర్మాతలు మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.