వారం రోజుల్లో కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మాయం అవ్వాలా.. అయితే ఇది ట్రై చేయండి!

సాధారణంగా చాలా మందికి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.వీటినే డార్క్ సర్కిల్స్( Dark circles ) అని కూడా పిలుస్తాము.

అయితే డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.ఒత్తిడి, అధికంగా ఫోన్ లాప్ టాప్ టీవీలు చూడటం, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, డిప్రెషన్, పోషకాల కొరత, హార్మోన్ చేంజ్ ఇలా రకరకాల కారణాల వల్ల కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

ఏదేమైనా ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.అందాన్ని దెబ్బతీస్తాయి.

మీరు కూడా నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.? వారం రోజుల్లో వాటిని మాయం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సీరం ను అస్సలు మిస్ అవ్వకండి.ఇదొక న్యాచురల్ సీరం.

Advertisement

నిత్యం ఈ సీరంను వాడితే కనుక చాలా వేగంగా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న కీరా దోసకాయను( Kiera cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా కడిగి తొక్కని సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు మరియు నిమ్మ పండు తొక్కలు( Lemon peels ) వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన పదార్థాలను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ అలోవెరా జెల్( Aloe vera gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.

Advertisement

ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు మరియు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న సీరం ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ సీరం ను కనుక వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.

డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి బయటపడటానికి ఈ సీరం చాలా ఎఫెక్ట్ గా సహాయపడుతుంది.కాబట్టి తప్పక ట్రై చేయండి.

తాజా వార్తలు