ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ చూపుతున్నారు.అందుకోసం వారి ఆరోగ్యానికి ఎలాంటి ఆహార పదార్థాలు మంచివో అవే ఎక్కువగా తీసుకుంటున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే నువ్వులు( Sesame seeds ) మన శరీరానికి వేడి చేస్తాయని చాలా మందికి తెలుసు.నువ్వులు ముందుగా వేడి చేసిన ఆ తర్వాత చలవ చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఈ నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నువ్వుల కారం పొడి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాతాన్ని, అంతే కాకుండా శరీరంలోని చెడు నీటిని బయటకి పంపుతుంది.నువ్వులు ఎక్కువగా తింటే పైత్యం చేస్తుంది.
నువ్వుల వడియాలు తింటే చల్లగా ఉన్నా శరీరంలో వేడిని పుట్టిస్తుంది.అంతే కాకుండా శరీరాన్ని బలంగా మారుస్తుంది.
అంతే కాకుండా నువ్వులతో మసాలా దినుసులు కలిపి చేసిన పచ్చడి రుచిగా ఉండి జఠరాగ్నిని పెంచి వాతాన్ని దూరం చేస్తుంది.వేయించిన నువ్వులు, బెల్లం కలిపి ముద్ద చేసి నిద్రించే ముందు 20 గ్రాముల ముద్ద తినడం వల్ల మలబద్ధకం దూరమైపోతుంది.మంచి నువ్వుల నూనెతో పావు గంట పాటు తైలమర్దనం జీవితంలో ఎలాంటి రోగమైన దూరం అవ్వాల్సిందే.ఇంకా చెప్పాలంటే కాల్చిన నువ్వుల చెట్ల బూడిదకి సమంగా యవక్షారం కలిపి పుటకు రెండు గ్రాముల చొప్పున రెండు చెంచాల నిమ్మరసంతో తీసుకుంటే తీవ్రమైన గుండె నొప్పి కూడా తగ్గిపోతుంది.
అంతే కాకుండా అజీర్ణ సమస్యకు నువ్వులు గొప్ప ఔషధంగా పని చేస్తాయి.నువ్వులు, తెల్ల ఆవాలు, యవక్షారం సమానంగా తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి.దీని నుంచి తగినంత చూర్ణాన్ని తీసుకుని పాలతో మెత్తగా నూరి చూర్ణాన్ని మొటిమల పై రాస్తే మొటిమల సమస్య దూరం అవుతుంది.