అక్కినేని ఇంటికి చిన్న కోడలుగా రాబోతున్న జైనాబ్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

అక్కినేని ఇంట వరుసగా పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ( Nagarjuna )పెద్ద కుమారుడు నాగచైతన్య ( Nagachaitanya ) శోభిత ( Sobhita ) వివాహం జరగబోతుంది.

 Do You Know The Back Ground Of Akhil Fiancee Zainab Ravji, Akhil,zainab, Engage-TeluguStop.com

ఇక ఈ విషయంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నాగార్జున మరో శుభవార్త తెలిపారు.తన రెండవ కొడుకు అఖిల్ ( Akhil ) అక్కినేని కూడా పెళ్లికి సిద్ధమయ్యారని ఈయన వెల్లడించారు.

అఖిల్ నిశ్చితార్థం జరిగిందంటూ ఈయన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రవ్జీ( zainab ravji )ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Akhil, Groundakhil, Nagarjuna, Zainab-Movie

ఈ క్రమంలోనే అఖిల్ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాల గురించి అభిమానులు ఆరాతీస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జుల్ఫీ రవ్జీ కుమార్తె ఈయనకు ఎన్నో వ్యాపార సంస్థలతో పాటు ఓడియన్ థియేటర్లో కూడా ఉన్నాయి ఈమె ఓడియం థియేటర్ వారసురాలు అని కూడా తెలుస్తోంది.ఒకప్పుడు ఓడియన్ థియేటర్ గా ఉన్న ఈ థియేటర్ ను ప్రస్తుతం మల్టీప్లెక్స్ గా మార్చారు.

ఇక ఈయనకి కూడా ఇండస్ట్రీలో ఎంతో ఉంచి సర్కిల్ ఉందని చెప్పాలి.అలాగే ఈయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరించారు.

Telugu Akhil, Groundakhil, Nagarjuna, Zainab-Movie

ఈయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా పని చేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవ‌లు అందించారు.ఇలా నాగార్జున కుటుంబానికి అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.ఇకపోతే అఖిల్ జైనాబ్ పరిచయం ఆరు సంవత్సరాల క్రితం జరిగిందని ఇలా వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఇలా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube