శ్రీరాముని చే ఆవిష్కరించబడిన రంగనాథ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మన దక్షిణ భారత దేశంలో అత్యంత పురాతనమైన వైష్ణవాలయాలలో శ్రీరంగనాథ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

ఈ రంగనాథ ఆలయం సుమారు 156 ఎకరాలలో విస్తరించి ఉండి భారత దేశంలోనే అత్యంత పెద్దదైన వైష్ణవాలయంగా పేరుగాంచింది.

ఆ విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతికరమైన 108 వైష్ణవాలయాలలో ఈ ఆలయం ఒకటి.ఇంత పెద్దదైన, పేరుప్రఖ్యాతులు గాంచిన వైష్ణవాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీరంగం అనే గ్రామంలో కొలువై ఉంది.

ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం ఈ ఆలయం వేల సంవత్సరాల కాలం నాటి నాగరికతను తెలియజేస్తుంది.

రామాయణం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం చేసిన సమయంలో సీతాదేవి అపహరణ జరుగుతుంది.అనంతరం సీత జాడ కనుకున్న శ్రీ రాముడు రావణాసురుడుతో యుద్ధం చేసి తిరిగి సీతను తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు.

Advertisement

ఈ క్రమంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు శ్రీరామచంద్రునికి ఎంతో సహాయపడతాడు.ఈ విధంగా అయోధ్యకు వచ్చి తిరిగి పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడిని వదిలి విభీషణుడు లంకకు వెళ్ళడానికి ఎంతో బాధపడతాడు.

ఆ సమయంలో శ్రీరామచంద్రుడు విభీషణుడికి శ్రీరంగనాథుని దివ్య మూర్తి ఇచ్చి తాను ఎప్పుడు నీ వెంటే ఉంటానని చెబుతాడు.

శ్రీరామచంద్రుడు ఇచ్చిన శ్రీరంగనాథుని తీసుకొని లంకకు బయలుదేరుతున్న సమయంలో మార్గమధ్యలోనే సంధ్యా సమయం కావడంతో విభీషణుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది ప్రాంతంలో సంధ్య కార్యక్రమాలను ఆచరించి తిరిగి వచ్చే సమయానికి రంగనాథుడు ప్రణవాకార, విమాన రూపంలో ప్రతిష్టం అవుతాడు.అది చూసి ఎంతో విచారిస్తున్న విభీషణుడికి సాక్షాత్తూ ఆ శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై ప్రతిరోజు సాయంత్రం సమయంలో నీ పూజలు అందుకుంటానని వరమిస్తాడు.ఈ విధంగా ఆ గ్రామంలో రంగనాథ ఆలయం శ్రీరాముడి చేత ఆవిష్కరించబడిన ఆలయంగా భావిస్తారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు