మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చేతి గీతలను, రాశిఫలాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.వారి జీవితంలో ఏ ముఖ్యమైన సంఘటనలు జరిగినా అవి రాశి ఫలాలు వల్లే జరిగాయని అనుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల రోజులకు ఒకసారి ప్రతి గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది.దానివల్ల ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతూ ఉంటుంది.
డిసెంబర్ 16న సూర్య భగవానుడు ధనస్సురాశిలోకి మారబోతున్నాడు.దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశులకు ఏర్పడే అవకాశం ఉంది.
దీని కారణంగా 2023వ సంవత్సరంలో ఈ మూడు రాశుల వారి వృత్తిలో సంపద పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి వారు కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా భాగస్వామ్యంలో ఏ పని అయినా ప్రారంభించాలనుకుంటే ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశి వారికి ఈ సమయంలో సంపద బాగా పెరిగే అవకాశం ఉంది.కన్యా రాశి వారు కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
ఈ సమయంలో ఈ రాశి వారు వాహనం, ఆస్తి, ఆనందాన్ని పొందే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో వ్యాపారులు బాగా లాభం పొందే అవకాశం ఉంది.
కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు అధికారులతో సమన్వయం వల్ల మెరుగ్గా పనిచేస్తారు.

మిధున రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ఏ పనిలో అయినా అనుకూలంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో సమన్వయం ఎంతో బాగా ఉంటుంది.ఈ రాశి వారు కూడా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే కెరియర్ లో ముందుకు సాగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.దీనితోపాటు ఆర్థిక విషయాలలో కూడా ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.