అజీర్తి.పిల్లల నుంచి పెద్దల వరకు సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.జీర్ణ సంబంధిత సమస్య ఇది.చెడు ఆహారపు అలవాట్లు అజీర్తి సమస్యకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అజీర్తి వల్ల ఆహారంపై ఆసక్తి తగ్గిపోతుంది.దీని కారణంగా శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు.ఫలితంగా జబ్బుల బారిన పడుతుంటారు.ఇంతవరకు రాకుండా ఉండాలంటే అజీర్తి సమస్యకు చెక్ పెట్టాలి.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిఫల చూర్ణం.
ఈ పేరు వినే ఉంటారు.ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణాన్ని విరివిరిగా వాడుతుంటారు.
త్రిఫల చూర్ణంలో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.
ముఖ్యంగా అజీర్తి సమస్యను తరిమి కొట్టడానికి త్రిఫల చూర్ణం అద్భుతంగా సహాయపడుతుంది.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి.
ఇలా రోజు చేస్తే జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.అజీర్తితో సహా ఇతర జీర్ణ సమస్యలన్నీ దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
పుదీనా సైతం అజీర్తి సమస్యకు చెక్ పెట్టడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్ లో ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులను బాగా మరిగించి.ఆ వాటర్ ను రోజుకు ఒకసారి తీసుకోవాలి.లేదా పుదీనా ఆకులను డైరెక్ట్ గా నమిలి కూడా తినొచ్చు.ఇలా ఎలా చేసినా అజీర్తి సమస్య నుంచి విముక్తి పొందుతారు.
లికోరైస్ రూట్ లేదా ములేటి రూట్.అజీర్తి సమస్యకు దూరంగా ఉండాలంటే దీనిని డైట్ లో చేర్చుకున్న మంచి ఫలితం ఉంటుంది.ఈ డైటరీ హెర్బ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
అలాగే కడుపును క్లీన్ చేస్తుంది.ములేటి రోట్ పౌడర్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది.
ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి.ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ఇలా చేసినా కూడా అజీర్తి తరచూ వేధించకుండా ఉంటుంది.