వింటర్ లో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను మీరు తినాల్సిందే!

ప్రస్తుతం వింటర్ సీజన్ ( Winter season )నడుస్తోంది.చలిపులి రోజు రోజుకు విజృంభిస్తూ పంజా విసురుతోంది.

 Health Benefits Of Eating Anjeer During Winter! Winter, Health, Health Tips, Goo-TeluguStop.com

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చలికాలంలో జలుబు, జ్వరం, ఫ్లూ, శ్వాస సంబంధిత సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి.అయితే ఈ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి అనుకుంటే కచ్చితంగా మీరు అంజీర్ తినాల్సిందే.

కొంచెం ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కూడా ఒకటి.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే అంజీర్( fig ) ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.

ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.

ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో రోజుకు రెండు అంజీర్ లను తిన‌డం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అంజీర్‌లో విటమిన్ ఎ( Vitamin A ) మరియు విట‌మిన్ సి మెండుగా ఉన్నాయి, ఇవి రోగ నిరోధక వ్యవస్థను( Immune system ) బలోపేతం చేస్తాయి.అనారోగ్యాలతో పోరాడటానికి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తాయి.

అలాగే వింట‌ర్ లో చలి తీవ్ర‌ను తట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు.అయితే అంజీర్ శరీరంలో వేడిని పెంచి చలిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

Telugu Anjeer, Anjeer Benefits, Dry Anjeer, Dry Fruits, Benefits Anjeer, Tips, L

వింట‌ర్ సీజ‌న్ లో రోజుకు రెండు అంజీర్ లను తినడం వల్ల జలుబు, ఫ్లూ, శ్వాస సంబంధిత సమస్యలు( Cold, flu, respiratory problems ), జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.ఒకవేళ వచ్చిన కూడా వాటి నుంచి చాలా వేగంగా రికవరీ అవుతారు.అంజీర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది మలబద్ధకాన్ని నివారించడంలో మరియు ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Telugu Anjeer, Anjeer Benefits, Dry Anjeer, Dry Fruits, Benefits Anjeer, Tips, L

అంజీర్ కాల్షియం యొక్క గొప్ప మూలం.బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కాల్షియం ఎంత అవసరమో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అంజీర్‌లో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అంతేకాకుండా అంజీర్ స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube