జిడ్డు సమస్య నుండి బయట పడటానికి అద్భుతమైన పాక్స్

కొంత మంది చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది.ఎందుకంటే వారి చర్మంలో సేబాషియస్ గ్రంధులు ఎక్కువగా ఉండటమే.

 Oily Skin Face Scrubs, Face Scrub, Telugu Health, Health Tips, Brown Sugar,lemon-TeluguStop.com

చర్మం జిడ్డుగా ఉండుట వలన చర్మం కాంతివిహీనంగామారుతుంది.అంతేకాక చర్మం పగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

అందువల్ల ఖరీదైన కాస్మొటిక్స్ వాడకుండా ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో జిడ్డు సమస్యను సమర్ధవంతంగా తొలగించవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ లో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి రాశి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పాలపొడి కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగావారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల దోసకాయ జ్యుస్ లో ఒక స్పూన్ బియ్యంపిండి కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube