ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.ఈ మూడు స్థానాలు కూటమి పార్టీలకే దక్కబోతుండడం , వైసిపికి( YCP ) పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఈ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీతో పాటు , ఒడిశా , పశ్చిమ బెంగాల్, హర్యానాలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ఉప ఎన్నికలే .ఇప్పటికే కొంతమంది పదవులకు రాజీనామా చేశారు.మరి కొంతమంది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలిచి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఏపీ నుంచి ముగ్గురు రాజీనామా చేశారు.
![Telugu Ap, Janasena, Rajyasabha Mp, Rajya Sabha-Politics Telugu Ap, Janasena, Rajyasabha Mp, Rajya Sabha-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/Who-are-the-three-who-are-going-to-go-to-the-Rajya-Sabhac.jpg)
వైసిపి తరఫున ఎంపికైన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు , ఆర్ కృష్ణయ్యలు ( Mopidevi Venkataramana, Beda Mastan Rao, R Krishnaiah )పార్టీకి , రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేశారు.వీరిలో మోపిదేవి వెంకటరమణ మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరారు.మరో ఇద్దరు ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు.
ఈ ముగ్గురికి మళ్లీ పోటీ చేసే అవకాశం లేనట్టే.ఖాళీ అయిన ఈ మూడు స్థానాలను ఏ విధంగా భర్తి చేస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.జనసేన పార్టీ ( Janasena party )తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబును ఎంపిక చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బిజెపికి కేటాయించడంతో నాగబాబు త్యాగం చేశారు.అయితే పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి కీలక పదవులు ఇస్తుండడంతో, నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమని , జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి .
![Telugu Ap, Janasena, Rajyasabha Mp, Rajya Sabha-Politics Telugu Ap, Janasena, Rajyasabha Mp, Rajya Sabha-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/Who-are-the-three-who-are-going-to-go-to-the-Rajya-Sabhad.jpg)
ఇక మిగిలిన రెండు స్థానాలు టిడిపి నాయకులకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది.దీంతో టీడీపీలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకునేందుకు చాలామంది సీనియర్ నేతలే పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు యనమల రామకృష్ణుడు తోపాటు, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ పేరు కూడా ఎక్కువ వినిపిస్తోంది.అయితే ఈ రెండు స్థానాలను భర్తీ చేసే విషయంలో చంద్రబాబు అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో , ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆశావాహుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.
ఈ నలుగురు సీనియర్ నేతలే కాకుండా, చాలామంది రాజ్యసభ సభ్యత్వం కోసం చంద్రబాబు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.ఇప్పుడు జరగబోతున్న మూడు రాజ్యసభ స్థానాల కు పూర్తి కాలం పదవి లేదు.
ఒక రాజ్యసభ పదవిక రెండేళ్ల అవకాశం ఉంది.ఒక సభ్యుడు పదవి 2026 ,మరో ఇద్దరి పదవులు 2028 కి పూర్తవుతాయి.