సోషల్ మీడియాలో ట్రెజర్ హంటింగ్‌కి ( treasure hunting )సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువుల కోసం చాలామంది మెటల్ డిటెక్టర్లు పట్టుకొని అన్ని ప్రదేశాలను అన్వేషిస్తుంటారు.
మెటల్ డిటెక్టర్ పరికరాన్ని ఉపయోగించి తాము విలువైన నిధులు కనుగొన్నామని చెబుతుంటారు.కానీ, ఈ వీడియోల్లో చాలా వరకు నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయినా, ఈ వీడియోలు చాలా మందికి నచ్చుతాయి కాబట్టి వేగంగా వైరల్ అవుతుంటాయి.
ఇలాంటి వీడియోలలో ఒకటి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.
ఈ వీడియోలో, ఒక వ్యక్తి బీచ్‌లో మెటల్ డిటెక్టర్‌తో( metal detector ) ఇసుకలో సెర్చ్ చేస్తూ కనిపించాడు.కొంతసేపటికి ఆ పరికరం ఒక చోట డింగ్ డింగ్ మంటూ మోగుతుంది.
అక్కడ తవ్వితే, ఆయనకు ఓ పదునైన ఇనుప ముక్క దొరికింది.అది ఎంతో ప్రమాదకరం.
ఎవరైనా దానిపై తొక్కితే గాయపడే ప్రమాదం ఉంది.ఆ వ్యక్తి ఆ ఇనుప ముక్కను జాగ్రత్తగా తీసివేశాడు.
ఈ వీడియోను కొన్ని రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా చూశారు.దీనికి లక్షల్లో లైక్‌లు, షేర్లు వచ్చాయి.కానీ, ఈ వీడియో నిజమో, నకిలీదో అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.చాలా మంది ఈ వీడియో నకిలీ అని అనుకుంటున్నారు.వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ఆ వ్యక్తి ఇసుకలో తవ్వే ముందే ఆ పదునైన ఇనుప ముక్కను అక్కడ దాచిపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.ఎందుకంటే, ఇసుకలో కొద్దిగా తవ్విన వెంటనే ఆ ముక్క పదునైన చివరలు కనిపిస్తున్నాయి.
కొందరు “ఇది నకిలీ వీడియో,” అని కామెంట్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయడం పిచ్చితనం అని అంటున్నారు.“బీచ్‌లో ఇలా పదునైన ఇనుప ముక్కలు పాతిపెట్టడం ఎంత ప్రమాదకరం! ముఖ్యంగా జంతువులకు ఇది చాలా ప్రమాదం” అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వియత్నాం బీచ్‌లో ఇలాంటి సంఘటన తనతో జరిగిందని, అది చాలా భయానకంగా ఉందని మరొక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నారు.ఈ వీడియోపై ఎన్ని విమర్శలు వచ్చినా, సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూనే ఉంది.
ఈ బీచ్ ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.