జామ పండుతో ఇలా చేశారంటే మీ చర్మం మెరిసిపోద్ది!

రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లలో జామ( Guava ) ఒకటి.వివిధ పోషకాలకు పవర్ హౌస్ లాంటి జామ పండ్లను పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

 Try This Guava Mask For Glowing And Beautiful Skin! Glowing Skin, Beautiful Skin-TeluguStop.com

ఇమ్యూటీని ప‌వ‌ర్ ను పెంచ‌డంలో, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో జామ చాలా అద్భుతంగా తోడ్ప‌డుతుంది.అయితే ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచే సత్తా కూడా జామ పండుకు ఉంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జామ పండు ఫేస్ మాస్క్ ను ట్రై చేశారంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గింజ తక్కువగా ఉన్న కొన్ని జామ పండు ముక్కలు వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్( Oats powder ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు జామ పండు ప్యూరీ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Beautiful Skin, Tips, Guava Benefits, Guava Face, Guava, Latest, Skin Car

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ జామ మాస్క్ ను తరచూ ప్రయత్నించడం వల్ల చాలా లాభాలు పొందుతారు.జామ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.జామలోని యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టడంలో హెల్ప్ చేస్తుంది.చర్మాన్ని మృదువుగా మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

Telugu Beautiful Skin, Tips, Guava Benefits, Guava Face, Guava, Latest, Skin Car

మొటిమలు మచ్చలు నివారణకు ఇప్పుడు చెప్పుకున్న జామ మాస్క్ ఉత్త‌మంగా తోడ్పడుతుంది.అంతేకాకుండా ఈ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.మురికి మృత కణాలను తొలగిస్తుంది.చర్మాన్ని దృఢంగా మరియు బిగుతుగా ఉంచడంలో కూడా ఈ మాస్క్ సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube