మ‌ద్యం సేవించేవారు `బీర‌కాయ` తింటే ఏం అవుతుందో తెలుసా?

బీరకాయ.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Ridge Gourd Can Prevent Liver Diseases? Ridge Gourd, Preventing Liver Diseases,-TeluguStop.com

ముఖ్యంగా భార‌తీయులు బీర‌కాయ‌ల‌తో అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు.బీర‌తో ఎన్ని ర‌కాల వంట‌లు చేసినా అమోఘం అని చెప్పాలి.

రుచిలోనే కాదు.ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ బీర‌కాయ ముందుంటుంది.

అయితే మ‌ద్యం సేవించేవారు అంటే మందుబాబులు బీర‌కాయ తింటే.లివ‌ర్‌ ప‌దిలంగా ఉన్న‌ట్టే.

ఆల్కహాల్ సేవించ‌డం వ‌ల్ల‌ లివ‌ర్ దెబ్బ తింటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.అలాంటి వారు బీర‌కాయ తింటే.

ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న లివ‌ర్‌ను రక్షిస్తుంది.అందుకే మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే.

వారి లివ‌ర్‌కి ఎలాంటి ఢోకా ఉండదు.ఇక బీర‌కాయ వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

Telugu Benefits, Tips, Latest, Liver Diseases, Ridge Gourd-Telugu Health - త�

బీరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు బీర‌కాయ డైట్‌లో చేర్చుకుంటే.మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.రక్తం శుధ్ది చేయడంలో బీర‌కాయ అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే బీరకాయలోని విట‌మిన్ సి, ఐరన్‌, మెగ్నీషియం ఇలా ఎన్నోఖనిజ లవణాలుంటాయి.ఇవి శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలోనూ.

గుండె ఆరోగ్యాన్ని మెరుప‌ర‌చ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారికి కూడా బీర‌కాయ బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి.

ఎందుకంటే.బీరకాయలో ఉన్న‌ పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

ఇక బీర‌కాయ‌లో పీచు పదార్థాలతో పాటు నీటి శాతం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.కాబ‌ట్టి, ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం మెరుగుప‌డ‌టంతో పాటు మలబద్ధకం స‌మ‌స్య కూడా పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube