1.తెలంగాణకు వర్ష సూచన

ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి అని అధికారులు తెలిపారు.
2.కేసిఆర్ పర్యటన ఖరారు
తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ ,సూర్యాపేట జిల్లాల పర్యటన ఖరారయ్యింది.ఆగస్టు 19 మెదక్, ఆగస్టు 20 న సూర్యాపేట జిల్లాలో కెసిఆర్ పర్యటిస్తారు.
3.గ్రూపు 2 పరీక్ష వాయిదా
ఈ నెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం తో, గ్రూప్ 2 పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తూ కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
4.కొత్త యాప్ ప్రవేశపెట్టిన టిఎస్ఆర్టిసి

” TSRTC గమ్యం ” బస్ ట్రాకింగ్ యాప్ ను టీఎస్ ఆర్టీసీ ప్రారంభించింది.
5.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కిషన్ రెడ్డి కామెంట్స్
డబుల్ బెడ్ రూమ్ ఏళ్ల పై త్వరలోనే ఉద్యమం చేపడుతామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
6.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా పెరిగిన రద్దీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా రద్దీ పెరిగింది.నిత్యం 5 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, ఒక్కో స్టూడెంట్ వెనుక 40 నుంచి 50 మంది సెండాఫ్ ఇవ్వడానికి వస్తున్నారని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి అన్నారు.
7.తిరుమల నడక మార్గంలో హై అలెర్ట్ జోన్
అలిపిరి నరకమార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై టిటిడి అప్రమత్తమయింది.తిరుమల నడక మార్గంలో హై అలెర్ట్ జోన్ ను ప్రకటించింది.
8.దొంగ ఓట్లు గుర్తింపు ఓటర్ల నమోదుపై వైసీపీ ఫోకస్

తాడేపల్లిలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో దొంగ ఓట్లు గుర్తింపు, ఓటర్ల నమోదుపై పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
9.పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు
పరిపాలన రాజధానిగా విశాఖను జగన్ ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా విమర్శించారు.టిడిపి హయాంలో విశాఖలో చోటు చేసుకున్న కబ్జాలపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని రోజా ప్రశ్నించారు.
10.ఏపీ డీజీపీ హెచ్చరిక
ఏపీలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
11.రాష్ట్రపతి ప్రధానికి చంద్రబాబు లేఖ

ఏపీలో హింస , నిరంకుశ పాలన , అరాచకాలు జరుగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాన నరేంద్ర మోదికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
12.సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ రైల్లో పొగలు
సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి.రైలు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు రావడాన్ని గమనించి రైలును నిలిపివేశారు.
13.దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.ప్రజలంతా తప్పకుండా సామాజిక మాధ్యమాల డిపి గా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు.
14.ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

హుకుంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ వచ్చినా ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు .ఈ వార్త తనను కలిచి వేసిందని కవిత అన్నారు.
15.జగన్ పై సిపిఐ విమర్శలు
సీఎంఓలో డిజిటల్ సంతకాల చోరీపై జగన్ నోరు విప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
16.బిజెపికి చంద్రశేఖర్ రాజీనామా

బీజేపీ కి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేశారు.పార్టీలో పని చేసే వారిని ప్రోత్సహించడం లేదని ఆయన ఆరోపించారు.
17.పవన్ పై విశాఖ ఎంపీ విమర్శలు
వీధి రౌడీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తేడా లేదని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు.
18.కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించారు

కాంగ్రెస్లో చేరాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారని బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు.
19.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు.
20.పీజీ వైద్య విద్య తొలి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్
పీజీ వైద్య సీట్లను భర్తీ చేసేందుకు నేటి నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈనెల 13 ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ ఎనిమిది గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.