అక్కినేని అఖిల్ మామ చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో అఖిల్ ( Akhil )అక్కినేని పెళ్లి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఒక్క మాట కూడా చెప్పకుండా ఎటువంటి హంగులు ఆర్బాటలు లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకునే షాక్ ఇచ్చాడు అఖిల్.

 Akhils Father In Law Zulfi Ravdjee A Big Shot In Real Estate, Akhil, Zulfi Ravdj-TeluguStop.com

అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దాంతో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అఖిల్ కాబోయే భార్య ఎవరని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడితే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

Telugu Akhil, Akhilslaw, Ground, Law, Estate, Tollywood, Zulfi Ravdjee-Movie

అఖిల్ ఫియాన్సీ పేరు జైనాబ్ రావుద్జీ‌( Zainab Raoudji ).ఆమె తండ్రి జుల్ఫీ రావుద్జీ‌.అయితే అఖిల్ మామ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదు.

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రముఖమైనదో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుద్జీ‌ ఫ్యామిలీ రేంజ్( Raodji Family Range ) అంతటిది.జుల్ఫీ రావుద్జీ‌ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్.

వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు.ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారట.ఆయన ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించారట.

Telugu Akhil, Akhilslaw, Ground, Law, Estate, Tollywood, Zulfi Ravdjee-Movie

ఇక ఆయన కుమారుడు జైన్ రావుద్జీ‌ ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు.రావుద్జీ‌ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్.7, బంజారాహిల్స్ లో నివాసం ఉండేవారు.దాదాపు కేబినెట్ మినిస్టర్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, ల్యాప్ టాప్, మూడు లక్షలు విలువ చేసే ఫర్నిచర్, లక్షన్నర విలువ చేసే కిచెన్ సామగ్రి, మెడికల్ రీయింబర్స్మెంట్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్, ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్లు అందించింది.

ఇక జైనాబ్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా దుబాయ్, లండన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో విలాసాల మధ్య పెరిగింది.ఇక ఢిల్లీకి చెందిన జైనాబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడానట, ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్‌కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం.

మొత్తానికి అఖిల్ మంచి డబ్బు ఉన్న కోటీశ్వరుల ఇంటికి అల్లుడిగా వెళ్ళబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube