టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలలో సత్యదేవ్( Satyadev ) ఒకరు కాగా ఈ హీరో యాక్టింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లో నటించిన సత్యదేవ్ కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లోనే నటించి పాపులర్ అయ్యారు.
సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉన్నా థియేటర్లలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాని ఈ మూవీ ఓటీటీలో మాత్రం హిట్ గా నిలిచింది.
సత్యదేవ్ తర్వాత రోజుల్లో నటించిన కొన్ని సినిమాలకు మంచి పేరు వచ్చినా ఆ సినిమాలు కమర్షియల్ గా హిట్ కాలేదు.
ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పగా ఆ డబ్బింగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.సత్యదేవ్ నటించి తాజాగా విడుదలైన జీబ్రా సినిమాకు( Zebra Movie ) పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
టాలెంట్ టన్నుల్లో ఉన్నా సత్యదేవ్ కు మాత్రం లక్ కలిసిరావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో అయినా సత్యదేవ్ దశ మారుతుందేమో చూడాల్సి ఉంది.గాడ్ ఫాదర్ సినిమాలో( God Father Movie ) విలన్ రోల్ లో నటించి సత్యదేవ్ మెప్పించారు.అయితే ఆ సినిమా కూడా కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.
సత్యదేవ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే కెరీర్ పుంజుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి సత్యదేవ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.భిన్నమైన కథలను ఎంచుకోవడం సత్యదేవ్ కు ఎంతగానో ప్లస్ అవుతోంది.
సత్యదేవ్ రేంజ్ తర్వాత రోజుల్లో ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.