ఇక పాత పాన్ కార్డులు పని చేయవా? కేంద్రం ఏం చెబుతోంది?

పాన్ కార్డు( Pan Card ) లేని వాళ్ళు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.మనది ఎవరైనా బ్యాంకు ఖాతాని తెరవాలనుకున్నప్పుడు పాన్ కార్డు అనేది తప్పనిసరిగా మారింది.

 Central Sensational Decision On Pan Card Qr Code Upgrade Details, Pan Card, Aadh-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇష్టం ఉన్న లేకపోయినా పాన్ కార్డు తీసుకోవడం ప్రతి ఒక్కరికి విధిగా మారింది.ఇక స్టూడెంట్స్, ఎంప్లాయిస్ సంగతి సరేసరి! పాన్ కార్డు లేని విద్యావంతులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.

అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాము.

Telugu Aadhar, Central, Pan Project, Pan, Pan Qr Upgrade-Latest News - Telugu

విషయం ఏమిటంటే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాన్, ఆధార్ కార్డును లింక్( Pan Aadhar Link ) చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం( Central Government ) మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.అవును మీరు ఆలోచిస్తుంది నిజమే.

ఈ పాటికే ఉన్న పాత కార్డులను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది.అయితే వీటి స్థానంలో పాన్ 2.0 కార్డులను జారీ చేయబోతున్నట్టు సమాచారం.

Telugu Aadhar, Central, Pan Project, Pan, Pan Qr Upgrade-Latest News - Telugu

దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అయితే పాత పాన్ కార్డులు మీద ఉన్న నెంబర్ మాత్రం పునరుద్ధరించబడదు.కొత్తగా వస్తున్న కార్డుల మీద మాత్రం క్యూ ఆర్ కోడ్లను ఉంచనుంది.

పాత పాన్ కార్డులు కలిగి ఉన్నవారు కొత్త పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 1435 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా టాక్స్ చెల్లిస్తున్న వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నారు.ఈ విషయమై కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ….ఇప్పటివరకు దేశంలో దాదాపుగా 78 కోట్ల మందికి పాన్ కార్డులు అందజేశామని, ప్రస్తుతం మరింత మందికి అందజేయను ఉన్నామని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube