యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విజయాలను అందుకున్నారు.కొన్ని సినిమాలలో తారక్ చేసిన పాత్రలను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.
అలాంటి రోల్స్ లో నటించి మెప్పించడం తారక్ కు మాత్రమే సాధ్యమని చెప్పవచ్ఛు.బాల రామాయణం, యమదొంగ, అదుర్స్ సినిమాలలో తారక్ భిన్నమైన పాత్రల్లో అలరించారు.
ఈ తరహా పాత్రలలో నటించడం మెప్పించడం సులువైన విషయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాల రామాయణం( Bala Ramayanam ) సినిమాలో రాముని పాత్రలో మెప్పించిన తారక్ యమదొంగ సినిమాలో( Yamadonga ) యముని పాత్రలో అదుర్స్ సినిమాలో( Adhurs ) చారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
ఈ పాత్రలలో తారక్ స్థాయిలో మరో నటుడు మెప్పించడం కూడా సాధారణమైన విషయం అయితే కాదని చెప్పవచ్చు.
![Telugu Adhurs, Bala Ramayanam, Jr Ntr, Prashanth Neel, Tollywood, War, Yamadonga Telugu Adhurs, Bala Ramayanam, Jr Ntr, Prashanth Neel, Tollywood, War, Yamadonga](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-tiger-junior-ntr-only-having-this-much-acting-skills-detailsa.jpg)
ఇలాంటి పాత్రల్లో అద్భుతంగా నటించడం ఎన్టీఆర్ కే సాధ్యం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాకే( War 2 ) పరిమితమై ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్న సంగతి తెలిసిందే.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమాలో తారక్ పాత్ర గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
![Telugu Adhurs, Bala Ramayanam, Jr Ntr, Prashanth Neel, Tollywood, War, Yamadonga Telugu Adhurs, Bala Ramayanam, Jr Ntr, Prashanth Neel, Tollywood, War, Yamadonga](https://telugustop.com/wp-content/uploads/2024/11/young-tiger-junior-ntr-only-having-this-much-acting-skills-detailss.jpg)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మరపురాని పాత్రను ప్రశాంత్ నీల్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్న తారక్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారనే చర్చ జరుగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ కావడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలో భారీ డీల్స్ కు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది.