డార్లింగ్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన చిత్రం సలార్.( Salaar ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంత డివిజన్ సాధించిందో మనందరికీ తెలిసిందే.
ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయ్యి కోట్లల్లో కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టార్గెట్ లెక్కలకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే ఇటీవల విడుదల అయినా పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సినిమా బిజినెస్ లెక్కలు చాలా మారిపోయాయి.

సలార్ 2కి( Salaar 2 ) సంబంధించిన లెక్కలను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తియ్యబోయే మూవీ మొదలు సలార్ 2 వరకు అదే టార్గెట్ పెట్టుకుంటున్నారట.ప్రభాస్ తో చేసిన సలార్ 1 700 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.అదే విషయాన్ని ప్రశాంత్ నీల్ కూడా చెప్పారు.సలార్1 అనుకున్న అంచనాలను రీచ్ కాలేదు అని.అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో తగ్గేదెలా అంటున్నారు.బడ్జెట్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగాను సలార్ 2 2000 కోట్ల టార్గెట్ తో తెరకెక్కించాలనే ప్లాన్ చేసుకుంటున్నారట.

సలార్ పార్ట్ 1 లో జరిగిన మిస్టేక్స్ పార్ట్ 2 లో జరక్కుండా చూసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.అయితే ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఎప్పుడు సలార్ 2 ని స్టార్ట్ చేస్తారో అనేది క్లారిటీ రావడం లేదు.కారణం ప్రభాస్ వరసగా రెండు సినిమాలను ఫినిష్ చెసే పనిలో ఉండగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో( NTR ) మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.సో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవ్వుద్దో అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా ఎక్కువ ఆలస్యం అయ్యే కొద్ది సినిమా పట్ల ఆసక్తి తగ్గుతుంది అని తొందరగా స్టార్ట్ చేయాలంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలతో బిజీ బిజీగా ఉన్నారు.
మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి మరి.