సాధారణంగా మన శరీరానికి ఎల్లప్పుడూ చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి.అందుకే శరీరంలో ఒక్క పోషకం లోపించిన కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవ్వాల్సి వస్తుంది.
అందుకే ఎల్లప్పుడూ వైద్య నిపుణులు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు.కాబట్టి తరచూ పోషకాహారాలు తీసుకోవడం చాలా మంచిది.
లేదంటే శరీరం నీరసంగా, అలసటగా మారిపోతుంది.కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
శరీరానికి విటమిన్( Vitamin ) చాలా అవసరం.విటమిన్ A, B, C, D, E, K లోపం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు.
శరీరం బలహీనంగా మారిపోతుంది.అంతేకాకుండా ఎముకలు కూడా కుచించిపోతాయి.అలాగే కండరాలలో నొప్పులు ( Pain in the muscles )మొదలవుతాయి.అంతేకాకుండా జుట్టు సమస్యలు( Hair problems ) కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అందుకే విటమిన్స్ లోపం ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కువగా వృద్దులు, గర్భిణీ స్త్రీలు విటమిన్ సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు.అందుకే వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి.
ఇక పోషకాల లోపం తో బాధపడేవారు పండ్లు, ఆకుకూరలను ( Fruits and vegetables )ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో పోషకాలు లోపం ఉన్నవారు తప్పకుండా మల్టీ విటమిన్ సప్లిమెంటులను తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వలన లోపం తొలగిపోవడమే కాకుండా క్రోమియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు శరీరానికి లభిస్తాయి.అయితే మల్టీ విటమిన్లు తీసుకోవడం వలన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఇవి శరీరాన్ని శక్తివంతంగా మార్చేందుకు సహాయపడతాయి.అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.అందుకే నొప్పులు అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మల్టీ విటమిన్స్ తీసుకోవాలి.